తెలంగాణ రాష్ట్ర రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల మన్ననలు పొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో కేసీఆర్ కూడా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేస్తారని సమాచారం అందుతుంది . ఈటెల రాజేందర్ బయటికి వెళ్లినప్పటి నుంచి ఇలాంటి మార్పులు జరగలేదు. అంతేకాకుండా ఎమ్మెల్సీల భర్తీ విషయంలో కూడా కొత్త కేబినెట్ సమీకరణాలే చూసుకున్నారనే చర్చ సాగుతోంది.
Advertisement
also read:రఘువరన్ జీవితం అలా కావడానికి కారణం ఆ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ను ఎమ్మెల్సీ చేశారు. అంతేకాకుండా కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డిని పదవీ విరమణ చేయించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు . ఇక చాన్స్ రాదనుకున్న కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. అయితే వీరందరికీ కేబినెట్ సమీకరణలతోనే అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ క్షణంలో ఆయన మంత్రివర్గాన్ని మార్చేస్తారని అప్పటినుంచి ప్రచారం జరుగుతోంది.
Advertisement
అయితే ప్రస్తుతం వివాదాస్పద మంత్రులను మరియు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ముగ్గురు మంత్రులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు రెడ్డి సామాజిక వర్గ మంత్రులు ఉన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారు అన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే మంత్రి వర్గాన్ని సంక్రాంతి లోపే మార్చే అవకాశం కనిపిస్తోంది. మరి కొత్త మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు..? ఉన్న మంత్రివర్గం నుంచి ఎవరు బయటకు వెళ్తారు..? ముందు ముందు తెలుస్తుంది.
also read: