బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇంకా స్టార్ హీరో కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ నవదంపతులు మ్యారీడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా వీరు ఎంతో సీక్రెట్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా సెలబ్రేషన్స్ మూమెంట్స్ ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నా.. ఇక విక్కీ-క్యాట్ మాత్రం వారి ఫోటోల్ని కూడా రహస్యంగానే ఉంచారు. పెళ్లికి ముందు ఎలా వ్యవహరించారో అలాగే పెళ్లి తర్వాత కూడా తమ వ్యక్తిగత ఫోటోల్ని లీక్ చేయలేదు. ఇక పెళ్లైన వెంటనే ఈ జంట హనీమూన్ కి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
ఆ డీటైల్స్ కూడా ఇంతవరకూ ఇక ఎక్కడా లీక్ అవ్వలేదు అంటే ఎంతగా గోప్యంగా ఉంచుతున్నారో స్పష్టంగా అర్ధమవుతోంది.ఇక తాజాగా పెళ్లైన తర్వాత మొదటి సారి ఓ ఫోటోని కత్రినా కైఫ్ ఇన్ స్టా వేదికగా పంచుకుంది. తమ ఫ్టాట్ లో దిగిన ఓ సెల్ఫీని ఇలా ఇన్ స్టాలో క్యాట్ పంచుకుంది. ఇందులో క్యాట్ వింటర్ కోట్ ధరించి సోఫాలో కూర్చుని కెమెరాకి తన క్యూట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్ తో ఫోజులిచ్చింది. అలాగే మెడలో మంగళ సూత్రం టూస్మార్ట్ గా ఈ ఫోటోలో మంచి హైలైట్ గా కనిపిస్తోంది.
సాధారణంగా హీరోయిన్లు పెళ్లైన తర్వాత మంగళ సూత్రాలు మెడలో ఉంచుకోవడం అనేది అరుదు. మంగళ సూత్రాలు ఉన్నా కానీ అవి అసలు బయటకు కనిపించకుండా..వాటిని మెడలో డిజైనర్ జ్యూవెలరీతోనే కెమెరాకి ఫోజులివ్వడం చూస్తూ ఉంటాము. ఇక పర్సనల్ ఫోటో షెషన్ అయినా..లేక వృత్తిగతమైనది అయినా. కానీ ఇక్కడ మాత్రం కత్రినా కైఫ్ ఇవేవీ కేర్ చేయలేదు. తన మంగళ సూత్రం రహస్యంగా ఉంచలేదు. సూటిగా లైవ్ లీగా ఫోటో రూపంలో మన ఇండియన్ ట్రెడిషన్ ని గౌరవిస్తూ ఇలా ఇన్ స్టాలో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కత్రినా కైఫ్ ని చాలా మంది నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.