కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ సెలబ్రిటీ వెడ్డింగ్‌కు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ఇందులో పెళ్లి ఆచారాల నుండి విలాసవంతమైన ఈవెంట్ల వరకు సమాచారం ఉంది. ఇందులో నిజం ఎంత అన్న విషయం పక్కన పెడితే ఈ రోజు ఈ అందమైన జంట గ్రాండ్ వెడ్డింగ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రాయల్ వెడ్డింగ్ ఖర్చు మొత్తం విక్కీ కౌశల్ కాకుండా పెళ్లి కూతురు కత్రినా భరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పెళ్లి ఖర్చుల్లో 75 శాతం కత్రినా భరిస్తోంది అనేది ఆ వార్తల సారాంశం.
Advertisement
Advertisement
ఇప్పుడు కత్రినా కైఫ్, విక్కీల పెళ్లిలో డబ్బు నీళ్లలా ఖర్చు అవుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జంట ఈ రాయల్ ఈవెంట్ కోసం చాలానే ఖర్చు చేస్తోంది. అయితే ఆ ఖర్చులు ఎంత అన్న విషయం తెలియరాలేదు. కానీ ఓ బాలీవుడ్ వెబ్ నివేదిక ప్రకారం కత్రినా కైఫ్ ఈ వివాహానికి అయ్యే ఖర్చులలో 75 శాతం భరిస్తోందట. అంతే కాదు అతిథి, భద్రత, ప్రయాణం, ఇతర ఖర్చుల విషయంలో కత్రినా మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. రిపోర్ట్ ప్రకారం విక్కీ కౌశల్ పెళ్లి ఖర్చులో 25 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తన పెళ్లి విషయంలో మాత్రం రాజీ పడదని, అలాగే అతిథులకు సైతం ఎలాంటి లోటూ చూడకుండా ఉండడానికి కత్రినా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని అంటున్నాడు. ఉన్నోళ్ల కథే వేరు మరి !