Home » కాంట్రవర్సీ క్వీన్ కు కత్రినా గిఫ్ట్

కాంట్రవర్సీ క్వీన్ కు కత్రినా గిఫ్ట్

by Bunty
Ad

బాలీవుడ్ ప్రముఖ నటీనటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9న సవాయి మాధోపూర్ జిల్లా బవారాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వివాహం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వివాహానికి కేవలం ఈ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కావడంతో వివాహ వేడుకను రాయల్ గా, ఘనంగా నిర్వహించారు. అయితే విక్కీ అండ్ కత్రినా ముంబైలో తమ స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్‌ని నిర్వహించాలని యోచిస్తోంది. అంతకు ముందు ఈ జంట తమ పెళ్లి వేడుకలను జరుపుకోవడానికి పరిశ్రమలో ఉన్న తమ స్నేహితులకు చేతితో రాసిన నోట్స్‌తో కూడిన సర్ప్రైజ్ గిఫ్ట్ లను పంపారు. వీరి బాస్కెట్‌ను అందుకున్న వారిలో నటి కంగనా రనౌత్ ఒకరు.

kangana

Advertisement

Advertisement

రుచికరమైన ‘దేశీ నెయ్యి’ లడ్డూల కోసం కత్రినా, విక్కీకి ధన్యవాదాలు అంటూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసింది. “నూతన వధూవరులుకత్రినా కైఫ్, విక్కీ కౌశల్ నుండి రుచికరమైన దేశీ నెయ్యి లడ్డూలు… ధన్యవాదాలు… ఇంకా చాలా అభినందనలు” అంటూ కంగనా పువ్వులు, పేరు కార్డ్, బహుమతి పెట్టెకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. విక్కీ, కత్రినా ఇద్దరూ తమ సంబంధం, పెళ్లి పుకార్ల గురించి పెదవి విప్పలేదు. ఇద్దరూ కలిసి తమ మొదటి వివాహ ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఒకేలాంటి నోట్స్‌తో పంచుకున్న తర్వాత చివరకు వారి మౌనాన్ని వీడారు. “ఈ క్షణానికి మమ్మల్ని తీసుకువచ్చిన ప్రతిదానికీ మా హృదయాలలో ప్రేమ, కృతజ్ఞత ఉన్నాయి. మేము కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలను కోరుతున్నాము” అని నోట్ లో రాశారు.

Visitors Are Also Reading