Home » పెళ్ళిలో ఉద్వేగానికి లోనైన కత్రినా

పెళ్ళిలో ఉద్వేగానికి లోనైన కత్రినా

by Bunty
Ad

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విక్కీ, కత్రినా గురువారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కత్రినా, విక్కీ ఇద్దరూ వివాహ వేడుకలో డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. ఇందులో ఈ జంట చాలా అందంగా కనిపించింది. అయితే పెళ్లి సమయంలో కత్రినా కైఫ్ ఎమోషనల్ అయ్యిందన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. కత్రినా కైఫ్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఒకదానిలో ఆమె కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ ఫోటో చూసిన అభిమానులు వెంటనే గుర్తించారు. కత్రినా ఫోటోలో నవ్వుతూ ఉండగా, అదే సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ సమయంలో, విక్కీ కౌశల్ అతని చేయి పట్టుకున్నాడు.

Advertisement

Image

Advertisement

కత్రినా ఉద్వేగానికి లోనైన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించారు అభిమానులు. డిసెంబర్ 7 నుంచి రాజస్థాన్‌లో కత్రినా, విక్కీల వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. సంగీత్, మెహందీ, హల్దీ తర్వాత, ఈ జంట డిసెంబర్ 9న ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి ఇరువురి ప్రత్యేక స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత విక్కీ, కత్రినా ఈరోజు ముంబైకి వెళ్లిపోయారు. సవాయ్ మాధోపూర్ నుంచి ప్రైవేట్ హెలికాప్టర్‌లో జైపూర్ విమానాశ్రయానికి బయలుదేరారు. విక్కీ, కత్రినా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలలో కత్రినా పీచ్ కలర్ సూట్ ధరించగా, విక్కీ డెనిమ్ షర్ట్, బ్లేజర్ ధరించాడు.

Visitors Are Also Reading