Home » థియేటర్లో తగ్గనంటున్న కార్తికేయ 2.. ఓటీటీలోకి ఎప్పుడు అంటే..?

థియేటర్లో తగ్గనంటున్న కార్తికేయ 2.. ఓటీటీలోకి ఎప్పుడు అంటే..?

by Azhar
Ad
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకతంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా అనేది ఎంత పెద్ద హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటుగా హిందీలో కూడా విడుదల అయిన ఈ సినిమా భారీ ప్రజాధారణ అనేది అందుకుంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా రెండు వారలు కాకముందే 100 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇక కార్తికేయ 2 సినిమాలో నటించిన నిఖిల్ కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమా భగవంతుడు శ్రీకృష్ణుడు మీద రావడంతో ప్రజలకు ఇంత బాగా నచ్చింది అనే చెప్పాలి. అయితే ఈ సినిమా గత నెల 13న విడుదల అయ్యింది. హిందీలో 1000కి థియేటర్లలో ఈ సినిమా నడిచింది. ఇక ఈ సినిమా వచ్చి బేలా రోజులు గడుస్తున్నా ఇప్పటికి కార్తికేయ 2 రోజుకు 60 లక్షల కంటే ఎక్కువనే వసూల్ చేస్తుంది.
అయితే ఈ సినిమా వచ్చి ఇన్ని రోజులు అవుతున్న ఇంకా ఓటీటీలోకి ఈ సినిమా అనేది రావడం లేదు చాలా మంది అనుకుంటున్నారు. ఇన్ని రోజులు అయిన ఇంకా ఈ సినిమా దేశంలో 1000కి పైగా థియేటర్లలో ఆడుతున్న కారణంగానే దీనిని ఇంకా ఓటీటీలోకి తేవడం లేదు అని తెలుస్తుంది. కానీ ఈ నెల 30 లోపు తప్పకుండ కార్తికేయ 2 ఓటీటీలోకి వస్తుంది అని సమాచారం.

Advertisement

Visitors Are Also Reading