Home » Karthikeya 2 Movie Review : నిఖిల్ కార్తికేయ 2 సినిమా రివ్యూ..!

Karthikeya 2 Movie Review : నిఖిల్ కార్తికేయ 2 సినిమా రివ్యూ..!

by Anji
Ad

Karthikeya 2 Movie Review : రొటిన్ క‌థ‌ల‌తో కాకుండా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉండేవిధంగా విభ‌న్న క‌థ‌ల‌ను ఎంచుకునే యువ హీరో నిఖిల్ హీరోగా న‌టించిన తాజా థ్రిల్ల‌ర్ మూవీ కార్తికేయ 2. చందు మెండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కార్తికేయ 1 సూప‌ర్ సాధించడంతో కార్తికేయ 2 కి ఆడియ‌న్స్ నుంచి పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. కార్తికేయ లో మెడిక‌ల్ స్టూడెంట్ గా న‌టించిన నిఖిల్ కార్తికేయ 2లో డాక్ట‌ర్ గా న‌టించాడు.

Also Read: Vidura Niti : విదురుడు చెప్పిన ఈ నియమాలు పాటిస్తే మీకు తిరుగుండ‌దు..!

Advertisement

Karthikeya 2 Movie Review

Karthikeya 2 Movie Review

ముఖ్యంగా యంగ్ హీరో నిఖిల్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ఒక‌టి. ఈ సినిమా హిట్ కావ‌డంతో దీనికి సీక్వెల్‌గా కార్తికేయ 2 రూపొందించారు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అనుప‌మ్ ఖేర్‌, ఆదిత్య‌మీన‌న్‌, కే.ఎస్‌.శ్రీ‌ధ‌ర్‌, శ్రీ‌నివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, స‌త్య&హ‌ర్ష చెముడు త‌దిత‌రులున్నారు. కాల బైర‌వ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించారు. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇవాళ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. ఎలా ఉందో ఇప్పుడు మ‌నం చూద్దాం.

Karthikeya 2 Movie Review  క‌థ :

కార్తికేయ 2 ఊహ‌జ‌నిత‌మైన క‌థ‌తో తెర‌కెక్కింది. శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు కాలి కంక‌ణం చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంది. వృత్తి రిత్యా డాక్ట‌ర్ అయిన నిఖిల్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌పై శ్ర‌ద్ధ చూపుతుంటాడు. ద్వార‌క‌లో జ‌రిగే ప‌రిస్థితుల వెనుక ర‌హ‌స్యాన్ని వెతుకుతాడు. అత‌ని స‌త్యాన్వేష‌ణ అత‌న్ని కొన్ని పురాత‌న న‌మ్మ‌కాల‌కు ద్వార‌క‌లోని శ్రీ‌కృష్ణుడి శ‌క్తికి సంబంధించిన ఎన్నో విష‌యాల‌ను బ‌య‌టికి తీసుకువ‌స్తుంది. కార్తికేయ‌తో పాటు ఇంకెవ‌రికీ అది కావాలి..? దాని కోసం కార్తికేయ సాగించిన సాహ‌సోపేత ప్ర‌యాణం ఎలా సాగింద‌నేది ఈ చిత్రం యొక్క క‌థ‌.

Advertisement

నిఖిల్ కార్తికేయ 2 సినిమా రివ్యూ..!

ఇక న‌ట‌న ప‌రంగా నిఖిల్ కార్తికేయ పాత్ర‌లో ఒదిగిపోయాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఎప్ప‌టి మాదిరిగానే త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టు న‌టించింది. మ‌రోవైపు అనుప‌మ్ ఖేర్ కూడా బాగానే న‌టించాడు. కొన్ని సీన్ల‌లో శ్రీ‌నివాస‌రెడ్డి త‌న‌దైన టైమింగ్ తో న‌వ్వించాడు. ద‌ర్శ‌కుడు చందు మొండేటి ఎక్క‌డ కూడా ప్రేక్ష‌కుల‌కు బోర్ ఫీలింగ్ రాకుండా చిత్రాన్ని తీశాడు. కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని విజువ‌ల్స్ తో ఆక‌ట్టుకున్నాడు. కాల బైర‌వ సంగీతం కూడా ప‌ర్వాలేద‌నిపించింది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. అయితే కార్తికేయ 2లో కొన్ని మైన‌స్ పాయింట్‌లు కూడా ఉన్నాయి. కార్తికేయ రేంజ్ థ్రిల్ సీక్వెల్ లో లేదు. అల‌రించే చిత్రం అయిన‌ప్ప‌టికీ భారీ ట్విస్ట్‌, గూ్ బంప్స్ క‌లిగించే రేంజ్ ఈ చిత్రానికి లేద‌ని చెప్ప‌వ‌చ్చు. అదేవిధంగా స్లో అండ్ ఫ్లా్ నెరేష‌న్ కొంచెం నిరాశ ప‌రిచే అంవం. బీజీఎం ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది.


ఇక చివ‌ర‌గా ఒక కొత్త క‌థ‌ను ఆక‌ట్టుకునే క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు న‌డిపించారు. హీరో నిఖిల్ అన్నీ తానై సినిమాను న‌డిపించ‌గా ఆయ‌న సాహ‌సాలు మెప్పిస్తాయి. చెప్పుకోద‌గ్గ థ్రిల్స్‌, ట్విస్ట్ లేక‌పోవ‌డం ప్ర‌ధాన మైన‌స్ కాగా.. సినిమాని ఒక‌ సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అద్భుత‌మైన నిర్మాణ విలువ‌ల‌కు ప‌ట్టు ఉన్న స్క్రీన్ ప్లే, కొత్త క‌థ సినిమాకు ప్ర‌ధాన బ‌లం. ఆద్యంతం ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠను ద‌ర్శ‌కుడు క‌లిగించ‌గ‌లిగాడు. సినిమా ఆరంభంతో పాటు ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాలోని లొకేష‌న్స్ ప్రేక్ష‌కునికి మంచి అనుభూతిని పంచుతాయి.

Also Read : 

MACHERLA NIYOJAKAVARGAM MOVIE REVIEW : నితిన్ “మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం” సినిమా రివ్యూ..!

Visitors Are Also Reading