Home » విడుదలకు ముందే నష్టాలూ తెచ్చుకుంటున్న కార్తికేయ 2…?

విడుదలకు ముందే నష్టాలూ తెచ్చుకుంటున్న కార్తికేయ 2…?

by Azhar
Ad

నిఖిల్ హీరోగా ప్రస్తుతం కార్తికేయ 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2014 లో విడుదల అయిన కార్తికేయ సినిమా యొక్క సీక్వెల్ గా వస్తుంది. అయితే కార్తికేయ సినిమాలో కలర్ స్వాతి హీరోయిన్ గా నటించగా.. ఆ ఆసినిమా అప్పుడు సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే ఆ సినిమా యొక్క సీక్వెల్ ను ఇప్పుడు అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Advertisement

అయితే ఈ కార్తికేయ 2 యొక్క అనౌన్స్ మెంట్ అనేది ఎప్పుడో జరిగినా… కరోనా కారణంగా సినిమా విడుదల అనేవి ఆలస్యం అయ్యింది. కానీ ఎట్టకేలకు ఈ నెల 12న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన చిత్రబృందం ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా అనేది విడుదలకు ముందే నష్టాలను తెచ్చుకుంటుంది. అది ఎలా అంటే.. ఈ సినిమా విడుదల అవుతున్న అదే 12వ తేదీ నితిన్ యొక్క మాచర్ల నియోజకవర్గం అనే సినిమా కూడా వస్తుంది.

Advertisement

అందువల్ల ఒక్కే రోజు రెండు సినిమా విడుదల అయితే కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది అని భావించి.. కార్తికేయ 2 ను ఒక్క రోజు వెన్నకు అంటే ఈ నెల 13 శనివారంకు మార్చారు. కానీ అలా చేయడం వల్ల శుక్రవారం వచ్చే టాక్ తో వీకెండ్స్ శని, ఆది వారలు సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేస్తాయి. అయితే ఇప్పుడు కార్తికేయ 2 శనివారం వస్తే కేవలం ఒక్క ఆదివారం మాత్రమే మిగులుతుంది. కాబట్టి కలెక్షన్స్ తక్కువ వస్తాయి విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ లో టీం ఇండియా మ్యాచ్ ఫిక్స్.. ఏ రోజు అంటే…?

అప్పుడు ధోని రోహిత్ ను.. ఇప్పుడు అతను సూర్యను..!

Visitors Are Also Reading