Home » అమెరికాలో అరుదైన ఘనత అందుకున్న కార్తికేయ 2..!

అమెరికాలో అరుదైన ఘనత అందుకున్న కార్తికేయ 2..!

by Azhar
Ad
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన సినిమా కార్తికేయ 2. ఈ సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీలో కూడా విడుదల అయ్యింది. అయితే నిఖిల్ సినిమాలో హిందీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమా తెలుగులో హిట్ అయినా.. హిందీలో మాత్రం .సూపర్ హిట్ గా నిలిచింది.
ఇంకా చెప్పాలంటే.. ఇక్కడి కంటే అక్కడ హిందీలోనే ఈ సినిమాను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఇంత సూపర్ హిట్ అయిన ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ అందుకొని… ఓ రికార్డ్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి. ఈ సినిమాతో వచ్చిన సినిమాలు ప్లాప్ కావడం.. దీని తర్వాత వచ్చిన సినిమాలకు కూడా నెగెటివ్ టాక్ రావడంతో కార్తికేయ 2కి ఎదురు లేకుండా పోయింది.
అయితే ఈ సినిమా ఇక్కడ ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా అద్భుతంగా ఆడుతుంది. అయితే అక్కడ ఇప్పటికే 1.5 మిలియన్స్ వసూళ్లు చేసిన కార్తికేయ 2 ఏ తెలుగు సినిమా సాధించని అరుదైన రికార్డ్ ను అందుకుంది. అదేంటంటే.. ఈ సినిమా విడుదలై నాలుగు వారలు కాకముందే అమెరికాలో 80 లొకేషన్స్ లో విడుదల అయ్యింది. ఇలా ఇప్పటివరకు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు కూడా చేయలేకపోయాయి. దాంతో కార్తికేయ 2 ఖాతాలో మరో రికార్డ్ అనేది చేరిపోయింది.

Advertisement

Visitors Are Also Reading