కార్తీక మాసం హిందువులకు పరమ పవిత్రమైన మాసం. ఈ మాసం వస్తే చాలు హిందువులు ఉదయాన్నే చన్నీటి స్నానాలు, దీపాలు పెట్టుకోవడం వంటివి చేస్తారు. కొందరు ఉపవాసాలు ఉండి తమకు తోచిన విధంగా ఆ పరమేశ్వరుడిని పూజించుకుంటారు. స్నానం, దీపాలకు ఈ మాసంలో చాలా ప్రాధాన్యత ఉంది. అయితే.. వన భోజనాలకు కూడా చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు. అసలు కార్తీక మాసంలో వన భోజనాలు ఎందుకు చేస్తారు? వీటిని ఎక్కడ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకోండి.
Advertisement
వన భోజన కార్యక్రమం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. చిన్నా పెద్దా తేడా లేకుండా.. ఏదైనా దేవాలయ సన్నిధిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా వంటలు వండి.. దేవుడికి నివేదన అర్పించి.. బంధుమిత్రుల అందరి సమక్షంలో సంతోషంగా భోజనం చేయడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశ్యం. ఏడాది కాలంలో ప్రతి సారీ కలవడం కుదరకపోయినా.. ముఖ్యంగా కార్తీక మాసంలో దేవుని సన్నిధిలో ఇలా చేయడం అద్భుతంగ ఉంటుంది. అయితే.. విష్ణు మూర్తిని పూజించి ఇలా వనభోజనాలు చేసుకుంటే చాల పుణ్యం లభించి.. పాపాలు తొలగుతాయట.
Advertisement
అయితే.. ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేస్తే దాన్ని వనభోజనం అని అన్నారు. దేవాలయ సన్నిధిలోనే.. చెట్టు కిందే వంట ఏర్పాటు చేసుకుని.. అక్కడే అందరు కలిసి భోజనం చేస్తే దానిని వన భోజనం అని అంటారు. అరిటాకు, విస్తరాకు వంటివి ఏర్పాటు చేసుకుని వాటిల్లోనే భోజనం చేయాలి. మనం చేసే పని ప్రకృతి ఆమోదయోగ్యమై ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు కూడా ఇందులో భాగం ఉండాలని పెద్దలు చెబుతున్న మాట.
Read More:
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!