Home » వంట‌ల‌క్కకు కార్తీకదీపం సీరియ‌ల్ ఛాన్స్ ఎలా వ‌చ్చింది?

వంట‌ల‌క్కకు కార్తీకదీపం సీరియ‌ల్ ఛాన్స్ ఎలా వ‌చ్చింది?

by Azhar
Ad

తెలుగులో స‌క్సెస్ ఫుల్ సీరియ‌ల్ కార్తీక‌దీపం., కేవ‌లం వంట‌ల‌క్క కోసమే ఈ సీరియ‌ల్స్ చూసే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. వాస్త‌వానికి ఈ కార్తీక‌దీపం అనే సీరియ‌ల్ మ‌ల‌యాల కరతముత్తు కు రిమేక్. అందులో వంట‌ల‌క్క‌గా న‌టించినామె న‌ట‌న న‌చ్చి తెలుగులో కూడా ఆ పాత్ర‌కు ఆమెనే ఎంచుకున్నారు.

Advertisement

వంట‌ల‌క్క పేరు ప్రేమి విశ్వనాథ్. కేర‌ళ‌లోని ఎర్నాకులం ఎడ‌ప్ప‌ల్లిలో పుట్టిన ప్రేమి LLB కంప్లీట్ చేసి కొంత‌కాలం పాటు లీగల్ అడ్వైజర్ గా చేసింది. ఫోటోగ్ర‌ఫి మీద ఇంట్ర‌స్ట్ తో ఫోటోగ్ర‌పి నేర్చుకొని కొన్ని పెళ్లిళ్ల‌కు త‌న టీమ్ తో ఫోటోగ్ర‌పి చేసింది. త‌ర్వాత మోడ‌లింగ్ కూడా చేసింది అలా మోడ‌లింగ్ చేస్తున్న‌ప్పుడే కరతముత్తు సీరియ‌ల్ లో ఛాన్స్ వచ్చింది.

Advertisement

ఈ సీరియ‌ల్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ప్రేమీ పేరు మార్మోగింది. ముఖ్యంగా ఆ క‌ళ్ల‌తో ఆమె ప‌లికించిన హావాభావాల‌కు జ‌నాలు బాగా క‌నెక్ట్ అయ్యారు. అదే సీరియ‌ల్ ను తెలుగులో రిమేక్ చేసిన‌ప్పుడు ఆ పాత్ర‌కు ప్రేమీ అయితేనే న్యాయం చేయ‌గ‌లుగుతుంద‌ని భావించి ఆమెనే కార్తీక‌దీపంలో వంట‌ల‌క్క‌గా తెలుగులో ప‌రిచ‌యం చేశారు. ప్రేమి భర్త వినీత్ భట్ ప్ర‌ముఖ జ్యోతిష్యుడ ఈయ‌న‌ ”బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ది వరల్డ్” అనే అవార్డు అందుకున్నాడు ప్రేమిది ల‌వ్ మ్యారేజ్!

Visitors Are Also Reading