బాలీవుడ్లో ఈ ఏడాది ప్రారంభంలోనే వెడ్డింగ్ బెల్స్ మ్రోగడం ప్రారంభమైంది. వరుసగా వెండితెర, బుల్లితెర భామలు పెళ్లిపీటలు ఎక్కెస్తున్నారు. క్యోంకీసాస్ భీ కభీ బహుథీ, నాగిన్, బాల్వీర్ వంటి సీరియల్స్ తో పాటు బిగ్‌బాస్ సీజన్ 8 లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది కరిష్మా తన్నా సైతం పెళ్లి కూతురు అయిపోయింది. నాచ్ బలియే 7, ఝలక్ దిఖ్లా9, ఖత్రోంకీ ఖిలాడీ 10 సీజన్స్‌లో పాల్గొన్న కరిష్మాతన్నాకు మంచి క్రేజ్ ఉంది. సంజు, లాహోర్, కాన్పిడెన్సిజ్ఞల్లోతో పాటు పలు చిత్రాల్లో నటించిన 38 సంవత్సరాల కరిష్మా వివాహం ఫిబ్రవరి 05న ముంబైలో బోయ్‌ఫ్రెండ్, బిజినెస్‌మ్యాన్ వరుణ్ బంగేరాలో జరుగబోతుంది.
Also Read : ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి.. అవసరమైతే రాజీనామాకు సై..?
Advertisement
Advertisement
గురువారం హల్దీ వేడుక జరగగా.. శుక్రవారం మెహందీ ఫంక్షన్ ధూమ్ ధామ్ గా కొనసాగింది. వీటికి సంబంధించిన వీడియోలను, ఫొటోలను కరిష్మాతన్నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈజంట గత ఏడాది చివరిలో వివామ నిశ్చితార్థం జరుపుకున్నది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా శనివారం పెళ్లిని సింపుల్‌గా కొద్ది మంది సమక్షంలోనే కలర్పుల్గా జరుపుకోనున్నారు. ముఖ్యంగా హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read : Feb12న DJ టిల్లు విడుదల