Home » కొంప ముంచిన పార్టీలు..? కరీనా, అమృత అరోరాలకు కరోనా పాజిటివ్..!

కొంప ముంచిన పార్టీలు..? కరీనా, అమృత అరోరాలకు కరోనా పాజిటివ్..!

by AJAY
Ad

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కి క‌రోనా పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా అమృత అరోరా సైతం క‌రోనా బారిన పడ్డారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరీనా కపూర్ అమృత అరోరాలు ఇటీవల పలు పార్టీలకు హాజరైనట్టు తెలుస్తోంది.

Advertisement

kareena kapoor amrutha arora

kareena kapoor amrutha arora

ఈ క్రమంలోనే వారిద్దరూ కరోనా బారిన‌ పడినట్టు తెలుస్తోంది. ఇద్దరికీ క‌రోనా రాపిడ్ టెస్ట్ లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ గా నిర్ధారణ కాగా ఆర్టిపిసిఆర్ పరీక్షలు చేయించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ నటి మ‌లైకా అరోరా సోదరే వీరిద్దరికీ కరీనా కపూర్ తో మంచి స్నేహం ఉంది.

Advertisement

దాంతో ఎక్కువగా పార్టీలకు వెళుతూ సందడి చేస్తూ ఉంటారు. వీరు పార్టీల‌కు వెళ్ళిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే క‌రోనా కేసులు పెరుగుతున్న‌ సమయంలో వీరు పార్టీల‌కి వెళ్లడం తో ఇప్పుడు నెటిజ‌న్లు విమర్శలు కురిపిస్తున్నారు. కరోనా సమయంలో ఆయినా ఇంట్లో ఉండొచ్చు గా అంటూ చుర‌క‌లు అంటిస్తున్నారు. ఇక ప్రస్తుతం క‌రోనా పాజిటివ్ రావడంతో కరీనా కపూర్…. అమృత అరోరాలు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.

Visitors Are Also Reading