Home » అలాంటి వీడియోలు చేస్తున్నాడు అంటూ యూట్యూబర్ పై కరాటే కల్యాణి దాడి…వీడియో వైరల్…!

అలాంటి వీడియోలు చేస్తున్నాడు అంటూ యూట్యూబర్ పై కరాటే కల్యాణి దాడి…వీడియో వైరల్…!

by AJAY
Ad

టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసింది. గురువారం రాత్రి హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తి లో గల శ్రీకాంత్ రెడ్డి ఇంటికి కరాటే కల్యాణి వెళ్ళింది. అక్కడ మరో వ్యక్తితో కలిసి కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసింది. అయితే ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి సైతం కరాటే కళ్యాణి మరియు ఆమెతో వచ్చిన వ్యక్తి పై చేయి చేసుకున్నారు. అనంతరం కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి ని వెంబడించి మరీ చితక్కొట్టింది.

Advertisement

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీకాంత్ రెడ్డి మహిళలతో అసభ్యకరమైన ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడని అందుకే తాను ప్రశ్నించడానికి వచ్చానని తెలిపింది. ఈ క్రమంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అందుకే అతడిపై చేసుకున్నానని చెప్పింది. దాదాపు గంట పాటు శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ గొడవ జరుగుతున్న సమయంలో ఫ్రాంక్ వీడియోలు చేసి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తావ్ అంటూ కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని ప్రశ్నించింది. దాంతో శ్రీకాంత్ రెడ్డి నువ్వు పతివ్రత అనుకుంటున్నావా సినిమాలో ఎలాంటి పాత్రలు చేశావు….. అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ వాగ్వాదం లో శ్రీకాంత్ రెడ్డి షర్ట్ పూర్తిగా చిరిగిపోయింది. ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ….. కరాటే కళ్యాణి తనను లక్ష రూపాయలు డిమాండ్ చేసిందని చెప్పారు.

బీజేపీ కార్యకర్తను అని ప్రాంక్ వీడియోలు చేస్తున్నందుకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు పాల్పడిందని అన్నారు. తాను డబ్బులు లేవని చెప్పానని అందువల్లే తనపై దాడి చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకరి పై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

Also read :

“కేజీఎఫ్” లో పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన ఈ నటులు టీవీ సీరియల్స్ లో నటించారని తెలుసా…!

Visitors Are Also Reading