Home » సమంత ముందు తన ప్రపోజల్ ఉంచిన కరణ్ జోహార్..!

సమంత ముందు తన ప్రపోజల్ ఉంచిన కరణ్ జోహార్..!

by Azhar
Ad

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం సమంత – నాగ చైతన్య విషయమే హైలెట్ గా నిలుస్తుంది. అయితే ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట అనేది గత ఏడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్యలో వచ్చిన మనస్పర్థల వల్లే వీరు విడాకులు తీసుకున్నారు అని కామెంట్స్ వచ్చాయి. అయితే సమంత – నాగ చైతన్య విడిపోయి చాలా కాలం అవుతున్నా కూడా ఇంకా ప్రతిరోజు సోషల్ మీడియాలో వీరిపైనా చర్చా అనేది ఉంటూనే ఉంటుంది. అందుకు కారణం సమంత. ఆమె ఇచ్చే ఇంటర్వ్యూలలో నాగ చైతన్య గురించి కామెంట్స్ చేయడం.. అవి వైరల్ కావడం వంటిని జరుగుతున్నాయి.

Advertisement

అయితే ఇప్పుడు సమంత కాఫీ విత్ కరణ్ షో కు అక్షయ్ కుమార్ తో కలిసి వెళ్ళింది. అయితే ఈ కాఫీ విత్ కరణ్ షో అంటేనే కాంట్రవర్సీలకు పెట్టింది పేరుగా ఉంటుంది. ఈ షో పైన ఇప్పటికే చాలా కాంట్రవర్సీలు అనేవి జరిగాయి. ఇక ఇప్పుడు సమంత ఇందులోకి వెళ్ళింది. అక్కడ కూడా నాగ చైతన్య టాపిక్ అనేది వచ్చింది. అయితే ఈ షోలో మాత్రం సమంత నాగ చైతన్య గురించి చేసిన కామెంట్స్ అనేవి అభిరామానులకు ఇంకా కోపం అనేది తెప్పిస్తున్నాయి. ఇందులో సామ్ నాగ చైతన్య ను మాజీ భర్త అంటూ కామెంట్స్ చేసింది.

Advertisement

అందువల్ల ఈ ఎపిసోడ్ యొక్క ప్రోమో వచ్చినప్పటి నుండి అక్కినేని ఫ్యాన్స్ సమంతను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ షో యొక్క హోస్ట్ అయిన కరణ్ జోహార్ సమంత ముందు షోలోనే ఓ ప్రపోజల్ అనేది పెట్టాడు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. నువ్వు సింగిల్.. నేను సింగిల్ కాబట్టి మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెకేషన్ అనేది వెళదామా అని అడిగాడు. అయితే కరణ్ జోహార్ యొక్క ప్రపోజల్ కు మొదట నో చెప్పిన సమంత తర్వాత ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. ఇక ఇప్పుడు కూడా ఈ విషయంలో సమంతను చాలా రకాలుగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐ కొత్త సాఫ్ట్‌వేర్… ఆటగాళ్ల వయస్సు కోసం..?

సంజూ కంటే పంత్ బెస్ట్ అంటున్న పాక్ ఆటగాడు…!

Visitors Are Also Reading