Home » రియల్ లైఫ్ లో కాంతార సీన్ రిపీట్… నెట్టింట వైరల్ అవుతున్న వీడియో…!

రియల్ లైఫ్ లో కాంతార సీన్ రిపీట్… నెట్టింట వైరల్ అవుతున్న వీడియో…!

by AJAY
Ad

చిన్న సినిమా గా వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కాంతారా. ఈ సినిమాను కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోగా కూడా రిషబ్ శెట్టి నటించాడు. హోంబలే బ్యానర్ పై ఈ సినిమాను కేవలం 14 కోట్లతో నిర్మించగా దేశవ్యాప్తంగా 400 కోట్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కర్ణాటకలో కేజిఎఫ్ సినిమాను మించి కాంతార సినిమాకు కలెక్షన్ లు వచ్చాయి.

Advertisement

ఈ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటిటిలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాను కర్ణాటక లోని సాంప్రదాయ భూతకోలా ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పంజర్లీ అనే దైవం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.

Advertisement

కాగా ఈ సినిమా బృందం హీరో రిషబ్ శెట్టి హీరోయిన్ సప్తమి గౌడతోపాటు చిత్ర సభ్యులు నిర్మాతలు తిరునాడులో పంజర్లీ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి భూత కోలా ఆడుతూ ఉండగా దైవం ఆవహించింది. దాంతో భూతకోలా ఆడుతున్న వ్యక్తి రిషబ్ శెట్టి చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు.

అయితే అచ్చం ఇలాంటి సన్నివేశం సినిమాలో కూడా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి భూతకాలం ఆడుతూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారి చేతులను పట్టుకుంటాడు. ఇక రియల్ లైఫ్ లో జరిగిన సన్నివేశాన్ని హోంబలే నిర్మాణ సంస్థ ట్విట్టర్ లో షేర్ చేసింది. దాంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Visitors Are Also Reading