హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చిత్తా. ఈ సినిమాను తెలుగులో చిన్న పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం భాషలలో ఈ మూవీని రిలీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు సిద్ధార్థ్. దక్షిణాదిలోని రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తూ చిత్తా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న సిద్ధార్థ్ బెంగుళూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే విలేకరుల సమావేశంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది అనే చెప్పవచ్చు.
Advertisement
అక్కడకు చేరుకున్న కరవే సభ్యులు సిద్ధార్థ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వెంటనే ఇక్కడ నుంచి సిద్ధార్థ్ వెళ్ళిపోవాలని.. తమిళ నటుడి సినిమాను కన్నడలో ప్రచారం చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ వాదించారు. దీంతో సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఒక హీరో సినిమా ప్రచారాన్ని కన్నడ ఆందోళనకారులు అడ్డుకోవడాన్ని తప్పుపడుతూ సిద్ధార్థ్ కు క్షమాపణలు చెప్పారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఇక ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ సైతం సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలియజేశారు.
Advertisement
కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలు సంఘాలు చేపట్టిన కర్ణాటక బంద్ కు శివరాజ్ కుమార్ సంఘీభావం తెలియజేశారు. బెంగళూరులోని ఫిల్మ్ ఛాంబర్ సమీపంలోని గుజరాత్ కళ్యాణ మండపం వద్ద నిరసన తెలిపారు. శివన్న మాట్లాడుతూ.. కావేరి జలాల సమస్య మొదటి నుంచి ఉంది. దాని గురించి పోరాడుతూనే ఉన్నాం. కావేరి జలాల సమస్యకు ఆర్టిస్టులు రాలేదని ఆరోపిస్తున్నారు. కళాకారులు వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందా మేము మీలాగే మనుషులం. స్టార్ డమ్ ఇచ్చింది మీరే. దాన్ని తీసేయండి. మేము వచ్చి మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు అని శివన్న అన్నారు.