చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రముఖ నిర్మాత అనేకల్ బాలరాజ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో కన్నడ చిత్ర ససీమలో ఛాయలు అలుముకున్నాయి. 2022 కూడా చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదనే చెప్పవచ్చు. కరోనా సమయంలో చాలా మంది సినీ ప్రముఖులు మృత్యువాతపడ్డారు. ముఖ్యంగా భారతీయ సంగీత ప్రపంచంలో మేన నగధీరురాలు, భారతరత్న లతా మంగేష్కర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు మతి చెఉందిన విషయం విధితమే. ఆ తరువాత సంగీతంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బప్పిలహరి కూడా కన్ను మూయడం సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. మరొక వైపు టాలీవుడ్ సినీ సంగీతంతో తన పాటలతో మైమరిపించిన కందికొండ కూడా క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందారు. ఆ తరువాత శరత్, తాతినేని రామారావు వంటి దిగ్గజ దర్శకులు, నటినటులు ఇలా చాలా మంది మరణించారు.
Advertisement
తాజాగా కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత అనేకల్ బాలరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈయన మృతిపై కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమంతా ప్రముఖులు, నివాళులర్పిస్తున్నారు. బెంగళూరులోని జేపీ నగర్‌లోని ఆయన ఇంటి వద్ద ఆదివారం మార్నింగ్ వాక్ కోసం బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మాదిరిగానే తన కారులో ఓ పార్క్ వద్దకు వచ్చి రోడ్డు దాటుతుండగా.. ఇంతలోనే వేగంగా అటువైపు నుంచి వచ్చిన ఓ వాహనం ఈయనను బలంగా ఢీ కొట్టింది.
Advertisement
ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను సమీపంటో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్దకు తరలించారు. వైద్యులు ఆయనకు వెంటిలెటర్ పై చికిత్స అందించారు. అయిన ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇవాళ ఉదయం 10 గంటలకు మృతి చెందారు. ఈయన 2003లో దర్శన్‌తో నిర్మించిన కరియా చిత్రంత నిర్మాతగా శాండిల్‌వుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఇక ఈయన 2009లో కెంప చిత్రంతో తన కుమారుడిని నటుడిగా కూడా పరిచయం చేశారు.
Also Read :
మోహన్ బాబు మొదటి భార్య ఎవరో తెలుసా…? ఆమె ఎలా చనిపోయారంటే…!
చనిపోయే ముందు ఆ ముగ్గురు దర్శకులతో మాట్లాడిన ఉదయ్ కిరణ్…వారికి ఏం చెప్పాడంటే..!