Telugu News » Blog » కంగారూతో మాములుగా ఉండదు.. పంచ్ ఇస్తే పడిపోవాల్సిందే..!

కంగారూతో మాములుగా ఉండదు.. పంచ్ ఇస్తే పడిపోవాల్సిందే..!

by Anji
Ads

సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఏ వీడియో అయినా స‌రే వైర‌ల్ అయితే దానికి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ముఖ్యంగా జంతువులు, ప‌క్షుల‌కు సంబంధించిన వీడియోలు క్ష‌ణాల్లోనే వైర‌ల‌వుతున్నాయి. అల్ల‌రి చేస్ట‌లు, డేగ వేట ఇలా ప‌లు ర‌కాల వీడియోలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. ఇక ఆ వీడియోల‌ను చూసేందుకు నెటిజ‌న్లు సైతం తెగ ఆస‌క్తి చూపిస్తూ ఉన్నారు. తాజాగా ఓ కంగారు వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతుంది. కంగారులు త‌మ‌ను వెంటాడేందుకు వ‌చ్చిన ఇత‌ర జంతువుల‌ను, మ‌నుషుల‌ను త‌న్న‌డం.. బాక్సింగ్ చేయ‌డం వంటివి ద్వారా త‌మ‌ను తాము ర‌క్షించుకుంటాయి.

Ads

Ads

 

తాజాగా ఓ వ్య‌క్తి త‌న పెంపుడు కుక్క‌తో ఒక స‌రస్సు వ‌ద్ద ఎంజాయ్ చేస్తున్నాడు. అక‌స్మాత్తుగా అక్క‌డ‌కు వ‌చ్చిన ఓ పెద్ద కంగారు ఆ కుక్క పై దాడి చేసింది. దీంతో అత‌ను త‌న పెంపుడు కుక్క‌ను కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్పుడు అత‌నిపై కూడా కంగారు భ‌యంక‌రంగా దాడి చేసింది. ఆ వెంట‌నే ఆ పెంపుడు కుక్క కంగారును వెంబ‌డించింది. ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డే ఉన్న సీసీ కెమెరాల‌లో రికార్డు అయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :  తండ్రీ కొడుకులుగా బాల‌య్య డ‌బుల్ యాక్ష‌న్..?