Home » రాజ‌మౌళిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ప్ర‌శంస‌లు..!

రాజ‌మౌళిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ప్ర‌శంస‌లు..!

by AJAY
Ad

స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈ సినిమా కంటే ముందే రాజ‌మౌళి సీరియ‌ల్ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశాడు. ఆ త‌ర‌వాత స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా త‌ర‌వాత రాజ‌మౌళి చేసిన సినిమాల‌న్నీ వ‌రుస పెట్టి విజ‌యాలు సాధించాయి.

rajamouli

rajamouli

ఇక మ‌గ‌ధీర నుండి దేశవ్యాప్తంగా రాజ‌మౌళి క్రేజ్ ను సంపాదించుకున్నారు. బాహుబ‌లి తో రాజ‌మౌళి అంటే ఓ బ్రాండ్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇక రీసెంగ్ గా రాజ‌మౌళి చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ల‌తో తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ మొత్తం జ‌క్క‌న్న ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతోంది. కాగా తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ కూడా రాజ‌మౌళి పై ప్ర‌శంస‌లు కురిపించింది.

Advertisement

Advertisement

kangana

kangana

తాను గ్రేటెస్ట్ డైరెక్ట‌ర్ అనే పేరును రాజ‌మౌళి మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నార‌ని కంగ‌నా వ్యాఖ్యానించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేద‌ని పేర్కొంది. ఇది రాజ‌మౌళి చేసిన సినిమాల విజ‌యం కంటే ఆయ‌న విజ‌య‌మే అని పేర్కొంది. దేశం పై దేశం న‌మ్ముకున్న ధ‌ర్మం పై ఆయ‌నకు ఉన్న ప్రేమ గొప్ప‌ది. మీలాంటి రోల్ మాడ‌ల్ ఉండ‌టం అదృష్టం సార్…నేను మీ అభిమానిని అంటూ పేర్కొంది.

Visitors Are Also Reading