Home » స‌చిన్ ప్రాణ స్నేహితుడు అరెస్ట్.. ఎందుకో తెలుసా..?

స‌చిన్ ప్రాణ స్నేహితుడు అరెస్ట్.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ బ్యాట్స్‌మెన్ స‌చిన్ క్లోజ్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లీ త‌రుచుగా వార్త‌ల్లో నిలుస్తుంటాడు. త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో మ‌రొక‌సారి వార్త‌ల్లోకి ఎక్కాడు. అయితే ఈసారి మాత్రం పోలీసుల‌కు చిక్కిన కార‌ణం మాత్రం అస్స‌లు బాగోలేదు. త‌న దూకుడు బ్యాటింగ్ కు పేరుగాంచిన కాంబ్లీ అలాగే త‌న దూకుడైన ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా ప్ర‌స్తుతం ఇబ్బందుల్లో ప‌డ్డాడు. మ‌ద్యం మ‌త్తులో కారులో ఢీ కొట్టాడు. ఆరోప‌ణ‌ల‌పై టీమిండియా బ్యాట్స్‌మెన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేసారు. పోలీసులు కాంబ్లీకి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి బెయిల్‌పై విడుద‌ల చేశారు.

Advertisement

అయితే కాంబ్లీ మ‌ద్యం మ‌త్తులో బాంద్రాలోని త‌న రెసిడెన్సియ‌ల్ సొసైటీ గేటు వ‌ద్ద వాహనాన్ని ఢీ కొట్టిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. దీని త‌రువాత అత‌ను అక్క‌డున్న సొసైటీ తీవ్ర వాగ్వాదం చేశాడు. దాని కార‌ణంగా పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో.. ఆపై అత‌న్ని అరెస్టు చేశారు. అరెస్టు అనంత‌రం కాంబ్లీకి వైద్య పరీక్ష‌లు నిర్వ‌హించి బెయిల్ పై పోలీసులు విడుద‌ల చేశార‌ని వార్త సంస్థ వెల్ల‌డించింది. ముంబై పోలీసులు మాట్లాడారు. వినోద్ కాంబ్లీని అరెస్టు చేశాం. అనంత‌రం బెయిల్ పై విడుద‌ల చేశాం. అత‌ని వైద్య ప‌రీక్షలు బాబా హాస్పిట‌ల్ లో జ‌రిగాయ‌ని తెలిపింది.

Advertisement

సైబ‌ర్ మోసానికి గుర‌య్యాడు. కొన్ని నెల‌ల క్రిత‌మే కాంబ్లీ వేరే కార‌ణాల‌తో వార్త‌ల్లో నిలిచాడు. డిసెంబ‌ర్ 2021లో సైబ‌ర్ మోసం కేసు న‌మోదు అయింది. ఈ మేర‌కు కాంబ్లీ బాంద్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌న ఖాతా నుంచి ల‌క్ష రూపాయ‌లు డ్రా అయిన‌ట్టు పేర్కొంటూ ఫిర్యాదు చేసాడు. మొబైల్‌కు మెసేజ్ రావ‌డంతో మోసం జ‌రిగిన విష‌యం తెలిపిందంటూ పేర్కొన్నాడు. కెరీర్ వినోద్ కాంబ్లీ 1990లో జ‌ట్టులోకి ప్ర‌వేశించాడు. చాలా కాలం పాటు జ‌ట్టులో భాగ‌మ‌య్యాడు. అత‌ను 17 టెస్టుల్లో 54 స‌గ‌టుతో 1084 ప‌రుగులు చేశాడు. 4 సెంచ‌రీలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో 104 వ‌న్డేల్లో 2477 ప‌రుగులు అత‌ని బ్యాట్ నుంచి వ‌చ్చాయి. అత‌ను రెండు సెంచ‌రీలు, 14 అర్ధ‌సెంచ‌రీలు సాధించాడు.

Also Read :  IND Vs SL : శ్రీ‌లంక క్రికెట‌ర్లు ప్ర‌యాణించిన బ‌స్సులో బుల్లెట్ల క‌ల‌క‌లం

Visitors Are Also Reading