Home » ఆ హీరోతో సినిమా చేసి చివరికి ఆస్తులు అమ్ముకున్న కళ్యాణ్ రామ్…? చివరికి అలా తీర్చాడట..!

ఆ హీరోతో సినిమా చేసి చివరికి ఆస్తులు అమ్ముకున్న కళ్యాణ్ రామ్…? చివరికి అలా తీర్చాడట..!

by AJAY
Ad

నందమూరి నట వారసులుగా బాలయ్య తరం తర్వాత చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్, తారకరత్న తో పాటు నారా రోహిత్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిలో ఎన్టీఆర్ ఒక్కడే స్టార్ హీరోగా ఎదిగాడన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్థానంలో కళ్యాణ్ రామ్ కూడా హీరోగా సక్సెస్ అయ్యాడు రీసెంట్ గా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Advertisement

ఈ సినిమాల తర్వాత తన నటనకు ప్రశంసలు సైతం అందుకున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ హీరో గానే కాకుండా నిర్మాతగాను వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ తన బ్యానర్ లో ఇప్పటివరకు చాలా చిత్రాలను నిర్మించాడు. ఎన్టీఆర్ తదుపరి రెండు సినిమాలను కూడా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా బింబిసార సినిమాను కూడా కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించుకున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే రవితేజ తో చేసిన కిక్ 2 సినిమా వల్ల మాత్రం కళ్యాణ్ రామ్ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందట. కిక్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే కిక్ 2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని కళ్యాణ్ రామ్ భావించారు. దాంతో ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది.

అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన కిక్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్ కు భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో కళ్యాణ్ రామ్ కొన్ని ఆస్తులు అమ్ముకుని అప్పులు కట్టాడట. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా తీయగా ఆ సినిమా లాభాల బాట పట్టించింది. జై లవకుశ సినిమా తర్వాత కూడా కిక్ 2 నష్టాలను పూడ్చుకున్నాడట.

Visitors Are Also Reading