సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటే ఒక లెక్క..బ్యాగ్రౌండ్ లేకపోతే ఒకలెక్క అన్నట్టుగా ఉంటుంది. బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలతో బడా బ్యానర్ లు, దర్శకులు సినిమాలు చేస్తారు. వరుస ఫ్లాప్ లు పడినా ఆ తరవాత కూడా ఆఫర్ లు వస్తుంటాయి. కానీ బ్యాగ్రౌండ్ లేనివారిని మాత్రం ఇండస్ట్రీలో పట్టించుకునే నాథుడు ఉండడు. ఒకటి రెండు ఫ్లాప్ లు పడితే ఇంటిదారి పట్టాల్సిందే. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ పరిస్థితే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. విజేత సినిమాతో మెగాస్టార్ అల్లుడుగా కల్యాణ్ దేవ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.
Advertisement
ఆ సినిమాకు మెగా హీరోలు ప్రమోషన్ లు చేశారు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్…..ప్రీరిలీజ్ ఈవెంట్ లు గ్రాండ్ గా జరిగాయి. ఆ సినిమా తరవాత కల్యాణ్ దేవ్ ఒకటి రెండు సినిమాలు చేసినా హిట్ అవ్వలేదు. ఇక ఆ గ్యాప్ లోనే కల్యాణ్ దేవ్ కు ఆయన భార్య శ్రీజతో గ్యాప్ వచ్చినట్టు కనిపించింది. శ్రీజ తన సోషల్ మీడియా నుండి కల్యాణ్ దేవ్ పేరును మరియు ఫోటోలను డిలీజ్ చేసింది.
Advertisement
Kalyan dev
ఆ తరవాత కొన్నిసార్లు కల్యాణ్ దేవ్ తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కానీ ఆ ఫోటోలలో శ్రీజ కనిపించలేదు. అంతే కాకుండా ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు కూడా. ఇక మెగా ఫ్యామిలీ దూరం అయ్యాక కల్యాణ్ దేవ్ సినిమాలను కూడా పట్టించుకునేవారు లేరు.
kalyan dev
కల్యాణ్ దేవ్ నటించిన చివరి సినిమా సూపర్ మచ్చి కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ చెప్పుకోదగ్గ సినిమాలు కూడా చేయడం లేదు. ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ ను మెగాస్టార్ అల్లుడుగా చేసుకుంటున్నారు అనగానే ఉదయ్ కి ఆఫర్ లు క్యూ కట్టాయి. కానీ పెళ్లి క్యాన్సిల్ అయిన తరవాత ఇచ్చిన అడ్వాన్స్ లు కూడా తిరిగివెనక్కి తీసుకున్నారు. దాంతో ఉదయ్ కూడా మరో కల్యాణ్ దేవ్ అవుతాడా అంటూ నెటిజన్ లు కామెంట్ లు పెడుతున్నారు.
Advertisement