Home » విడాకుల వార్తలపై స్పందించ కళ్యాణ్ దేవ్….!

విడాకుల వార్తలపై స్పందించ కళ్యాణ్ దేవ్….!

by AJAY
Ad

సినిమా పరిశ్రమలో విడాకుల వార్తలు పెరిగిపోయాయి. కారణమేదైనా సెలబ్రిటీలు విడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి పరిశ్రమలోనూ విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Kalyan dev

Kalyan dev

అయితే ఆ తర్వాత కొంత కాలానికి నాగచైతన్య సమంత విడిపోతున్నట్లు ప్రకటించగా ఇప్పటికీ సమంత నాగ చైతన్య విడాకుల టాపిక్ ను సినీ ప్రియులు ఇంకా మర్చిపోలేదు. అయితే ఇంతలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్టు ప్రకటించారు. ధనుష్ కు కొంతమంది హీరోయిన్లతో ఫ్రెండ్ షిప్ ఉండటం వల్లే ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉంటే త్వరలో టాలీవుడ్ లో మరో జంట శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం శ్రీజ తన భర్త పేరు ఇన్ స్టాగ్రామ్ లో తొలగించడమే. ఇదివరకు శ్రీజ ఇన్ స్టాగ్రామ్ ఐడి శ్రీజ కళ్యాన్ అని ఉండగా ఇప్పుడు ఆమె దాన్ని శ్రీజ కొనిదెల గా మార్చేశారు. అయితే విడాకులపై వస్తున్న వార్తలపై కళ్యాణ్ తన సన్నిహితుల వద్ద స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సెలబ్రెటీల పర్సనల్ జీవితాలకు సంబంధించిన విషయాలను మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు మీడియాకు చెప్పాల్సిన పని లేదని కళ్యాణ్ తన స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. సెలబ్రిటీల మనోభావాలతో ఆడుకోవడం ఏమాత్రం మంచిది కాదని కళ్యాణ్ దేవ్ కామెంట్ చేసినట్టు కూడా తెలుస్తోంది.

Visitors Are Also Reading