Home » ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కల్పనారాయ్.. చివరి రోజుల్లో చితికి కూడా డబ్బులు లేక..!!

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కల్పనారాయ్.. చివరి రోజుల్లో చితికి కూడా డబ్బులు లేక..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమాల్లో చాలా వరకు లేడీ కమెడియన్లు చాలా అరుదుగానే ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా పాత సినిమాల్లో అయితే రమాప్రభ, గిరిజ ఆ తర్వాత శ్రీలక్ష్మి, వై విజయ కామెడీ పాత్రలో నటించగా.. ఆ తర్వాత కాలంలో వారి స్థానాన్ని భర్తీ చేసింది నటి కల్పనారాయ్.. కమెడియన్ గానే కాకుండా క్యారెట్ ఆర్టిస్ట్ గా సుమారు 400 పైగా చిత్రాల్లో నటించింది. మరీ ముఖ్యంగా హిట్లర్ సినిమాలో ఈమె కామెడీని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. అయితే కల్పనారాయ్ పేరు వినగానే చాలామంది తెలుగు నటి కాదని అంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. కల్పనారాయ్ తెలుగు మహిళ. ఆమె స్వస్థలం కాకినాడ..

Advertisement

కానీ ఆమె పేరు చివర రాయి అని ఎందుకు ఉందంటే దాని వెనక పెద్ద కథ ఉంది.. అదేంటో తర్వాత చూద్దాం.. ఇక కల్పన రాయి జీవితాన్ని గమనిస్తే.. ధనవంతుల ఇంట పుట్టిన ఆమె దానధర్మాలు చేస్తూ పొదుపు అనే మాట పట్టించుకోకుండా చివరి రోజులు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక దీనమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈమె సొంత ఊరు కాకినాడ.. అసలు పేరు సత్యవతి.. సినిమాల్లోకి వచ్చాక కల్పనాగా మారింది. కాకినాడలో ఉన్న సమయంలో కల్పన మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతని పేరునే తన పేరుగా మార్చుకొని కల్పన రాయిగా మారింది. హీరోయిన్ శారద అంటే ఈమెకు చాలా ఇష్టం.

Advertisement

also read:జాతీయ‌స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప‌విత్రా లోకేష్ సినిమా ఏదో తెలుసా…?

వీరి మధ్య ఉన్న పరిచయం కారణంగా సినిమాల్లోకి వచ్చింది. దర్శకుడు కోడి రామకృష్ణ హీరో వెంకటేష్ కల్పన రాయికి ఎక్కువ అవకాశాలు కల్పించారు. కుమార్తె కూడా ఉంది. ఆమె తల్లికి ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంది. దీంతో కల్పన రాయి కుంగిపోయింది. ఆ బాధ నుంచి కోలుకోలేక పోయింది. సినిమాల్లో సంపాదించిన డబ్బును పొదుపు చేయకపోవడం వల్ల, అడిగిన వారికి కూడా దానం చేస్తూ చివరకు ఆఖరి రోజుల్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొని, డయాబెటిస్ సమస్యతో ఆరోగ్యం క్షీణించింది. చివరికి చూసుకునే వారు ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో కల్పన రాయి ఉంది. చివరికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొందరు ముందుకు వచ్చి తన సొంత డబ్బులతో కల్పన రాయి అంత్యక్రియలు నిర్వహించారు. అంత ధనవంతురాలైన కల్పనా అంతక్రియలకు కూడా డబ్బులు లేకపోవడం చూసి అందరూ ఆవేదన వ్యక్తం చేశారు.

also read:

Visitors Are Also Reading