మనకు వేప చెట్టు కొమ్మకానీ ఆకులు కానీ నోట్లో వేసుకుంటే చాలా చేదుగా ఉంటాయి. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేప అనేది ఔషధాలు తయారీలో ముఖ్యపాత్ర వహిస్తుందట. అలాగే కాకరకాయ ఎంతో చేదుగా ఉన్న ఆరోగ్యానికి మాత్రం అనేక ప్రయోజనాలు కలగజేస్తుంది. ముఖ్యంగా కాకరకాయతో కూర వండుకున్న, సాంబార్ పెట్టుకున్న ఎంతో రుచిగా ఉంటుంది. అలాంటి కాకరకాయతో కాలేయానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయట.. అవేంటో చూద్దాం..
Advertisement
also read:నన్ను టార్గెట్ చేసి ఇండస్ట్రీ నుండి పంపాలనుకుంటున్నారు..యంగ్ హీరో ఎమోషనల్..!
Advertisement
ముఖ్యంగా కాకరకు కాలేయం చెడిపోకుండా లేదంటే దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి ఉంటుంది. ఇక షుగర్ వ్యాధిగ్రస్తులు రెండు నుంచి మూడు నెలల పాటు రెగ్యులర్ గా కాకర రసం తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలు తగ్గి కంట్రోల్లో ఉంటుందట. అంతేకాకుండా కడుపులో పరాన్నజీవులు చేరటం వల్ల పలు రకాల ఇబ్బందులను కూడా కాకర పసరు తొలగిస్తుందట. మలబద్ధకం ఉన్నవారు రోజుకు రెండు స్పూన్లు , రెండుసార్లు కాకరరాసాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రసాన్ని నీళ్లలో కలుపుకొని తాగితే కామెర్ల వ్యాధి కూడా తగ్గుతుందట.
ముఖ్యంగా కామెర్ల వ్యాధి సోకినప్పుడు కళ్ళు పచ్చగా మారుతాయి. ఆ పచ్చతనం మాయమయ్యే వరకు దీన్ని తీసుకోవాలి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాకరను తినకూడదు. అలాగే పండిన కాకరకాయను ఎవరు కూడా తినకూడదనీ ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం కాకరకాయ అంటే ఛీ అనేవారు ఇప్పటినుంచి కాకరకాయను కొరుక్కు తింటారు..
also read: