కాజల్ పసుపతి గురించి కోలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రజలకు అంతగా తెలియకపోయినా, తమిళంలో మాత్రం సుపరిచితమే. కో, మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక తెలుగులో అల్లు శిరీష్ నటించిన ద్విభాష చిత్రం గౌరవంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తూ తమిళ ప్రేక్షకులలో మంచి క్రేజ్ దక్కించుకుంది. తమిళ స్టార్ సూర్య నటించిన సింగం చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది.
Advertisement
ఓ ముఠాను పట్టుకునే సీన్ తో బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. ఇప్పటికీ ఆ సీన్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. 2008లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ ని పెళ్లాడింది కాజల్. కానీ కొంతకాలానికే పలు విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాని వివాహం చేసుకున్నారు. కాజల్ పసుపతి మాత్రం ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా ఉంటుంది.
Advertisement
అయితే గతంలో ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించిన కాజల్, తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఫైనల్ గా రెండో పెళ్లి చేసుకుంటున్నా. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా అంటూ పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోని షేర్ చేసింది. కానీ ఎవరిని పెళ్లి చేసుకోబోయేది అనేది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఆమె నిజంగానే రెండో పెళ్లి చేసుకుంటుందా లేక ఏదైనా మూవీ స్టంటా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!