Home » చంద్రముఖి 2 లో దెయ్యంగా ఆ స్టార్ హీరోయిన్..!

చంద్రముఖి 2 లో దెయ్యంగా ఆ స్టార్ హీరోయిన్..!

by Azhar
Ad

2005 లో రజినీకాంత్ హీరోగా చంద్రముఖి అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ఎంతో భయపెట్టింది అనే చెప్పాలి. ఇక ఇందులో చంద్రముఖి పాత్రలో దెయ్యంగా హీరోయిన్ జ్యోతిక కనిపించింది. ఇక ఈ సినిమా ఇప్పటికి కూడా టీవీలో వస్తే చాల మంది ఫ్యాన్స్ చూస్తుంటారు. అలాంటి చంద్రముఖి సినిమాకు ఇన్ని ఏళ్లకు సీక్వెల్ అనేది రాబోతుంది.

Advertisement

ఇప్పుడు ఉన్న హీరోలలో ఎక్కువగా దెయ్యం సినిమాల్లో నటిస్తున్న హీరో, డ్యాన్స్ మాస్టర్ అయిన రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 సినిమాను ప్రారంభిచారు. కానీ ఇందులో ప్రధాన పాత్ర అయిన చంద్రముఖిగా.. దెయ్యం పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఇన్ని రోజులు క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు దెయ్యంగా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో ఓ వార్త అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

అప్పుడు జ్యోతిక నటించిన ఆ చంద్రముఖి పాత్రలో ఇప్పుడు.. మరో స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ నటించబోతుంది అని తెలుస్తుంది. అయితే ఈ మధ్యే ఓ బాబుకు జన్మ అనేది ఇచ్చిన కాజల్.. ఈ మధ్యే మళ్ళీ షూటింగ్ అనేది ప్రారంభించింది. ఇక ఈ క్రమంలోనే కాజల్ ఈ చంద్రముఖి 2 సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది అని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐని ఇవ్వం అన్నారు.. ఐపీఎల్ వద్దన్నాడు..!

సిరాజ్ కు నిరాశే.. వెళ్ళేది ఆ ఇద్దరు..!

Visitors Are Also Reading