Home » Bigg Boss 5: ఈ వారమే లాస్ట్ ఎలిమినేట్… బయటకు వెళ్లేది ఈమేనా?

Bigg Boss 5: ఈ వారమే లాస్ట్ ఎలిమినేట్… బయటకు వెళ్లేది ఈమేనా?

by Bunty
Ad

బిగ్‌బాస్ షో క్ర‌మంగా చివ‌రి ద‌శ‌కు చేరుకుంటోంది. పోయిన వారంలో ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. కాగా, ఈవారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎలిమినేట్ లిస్ట్‌లో ఎవ‌రెవ‌రి పేర్లు ఉన్నాయి, ఫైన‌ల్‌గా ఎవ‌రు ఎలిమినేట్ అవుతారన్న‌ది కొన్ని గంటల్లోనే తేలిపోనున్న‌ది. గ‌త వార‌మై కాజ‌ల్ ఎలిమినేట్ కావాల్సి ఉన్నా చివ‌రి నిమిషంలో ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకున్న‌ది.

Advertisement

Advertisement

అయితే, ఈవారం సిరి, కాజ‌ల్ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. సిరి కంటే కాజ‌ల్‌కు త‌క్కువ ఓటింగ్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈవారం కాజల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే హౌస్‌లో సిరికి, ష‌ణ్ముఖ్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌షిప్‌పై సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌పై ష‌ణ్ముఖ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఫ్రెండ్‌షిప్ పేరుతో ముసుగులో ఎలాంటి ప‌నులు చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. స‌న్ని, మ‌నాస్‌, శ్రీరామ్‌లో ఎవ‌రో ఒక‌రు బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచే అవ‌కాశం ఉంటుంద‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.

Visitors Are Also Reading