నటి కాజల్ అగర్వాల్ గురించి తెలియని వారు ఉండరు. చందమామ లాంటి అందంతో టాలీవుడ్ ను ఏలుతోంది కాజల్. సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన నటిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మగధీర మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
Advertisement
ఆ తర్వాత నుండి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన కాజల్ చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. కొంతకాలం క్రితమే కాజల్ వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రితమే కాజల్ ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ గురించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
అదేంటంటే పెళ్లికి ముందు కాజల్ అగర్వాల్ టాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్ చేసిందని సమాచారం. కాజల్ మరియు రామ్ పోతినేని ఇద్దరు కలిసి గణేష్ అనే సినిమాను చేశారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారని, లివింగ్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారని ఈ వార్తల సారాంశం. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో కాజల్ కూడా చెప్పిందని సమాచారం. కానీ రామ్ కారణంగా ఈ జంట విడిపోయిందని ప్రచారం సాగుతోంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు
టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి