Telugu News » Blog » ఇప్పుడు కూడా అందుకు నేను సిద్ధం అంటున్న కాజల్..!

ఇప్పుడు కూడా అందుకు నేను సిద్ధం అంటున్న కాజల్..!

by Manohar Reddy Mano
Ads
అప్పుడెప్పుడో లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే టాలీవుడ్ లో కొన్ని రోజులు నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అయిన కాజల్ అగర్వాల్ తర్వాత మెల్లిగా సీనియర్ హీరోల పక్కన నటించడం ప్రారంభించింది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.
ఇక ఆ సమయంలోనే బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు తో ప్రేమాయణం అనేది నడిపిన కాజల్ ఆయనను పెళ్లి చేసుకుంది. అయిన కూడా సినిమాలకు దూరం కాలేదు. కానీ మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమాలో చేయడనికి కాజల్ ఒప్పుకున్న తర్వాత ఆమె తల్లి కాబోతుంది అని తెలియడంతో ఆ సినిమాతో పాటుగా సినిమాలకు మొత్తం దూరం అయ్యింది. ఇక ఈ మధ్యే కాజల్ ఓ అబ్బాయికి జన్మ ఇచ్చింది.
దాంతో ఇక కాజల్ సినిమాల్లోకి వస్తుందా లేదా అనేది అనుమానమే అని ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలో మళ్ళీ జిమ్ లోకి వెళ్లి ఫిట్నెస్ పైన దృష్టి పెట్టింది. ఇవ్వని ఆమె సినిమాలోకి రావడనికి సంకేతాలే అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కాజల్ ఓ ఐటం సాంగ్ చేయడనికి సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. అది కూడా అల్లు అర్జున హీరోగా వీస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2 లో కాజల్ ఓ స్పెషల్ సాంగ్ లో కపించనుంది అని ప్రచారం జరుగుతుంది.