Telugu News » కాజ‌ల్ అగ‌ర్వాల్ సీమంతం సెల‌బ్రేష‌న్స్..ఫోటోలు వైర‌ల్…!

కాజ‌ల్ అగ‌ర్వాల్ సీమంతం సెల‌బ్రేష‌న్స్..ఫోటోలు వైర‌ల్…!

by AJAY MADDIBOINA

అందాల చంద‌మామ కాజల్ అగ‌ర్వాల్ టాలీవుడ్ లో ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. కాజ‌ల్ టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న న‌టించి త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్ప‌టికే ప‌లు సినిమాలు చేసిన కాజల్ మ‌గ‌ధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఈ సినిమాలో యువ‌రాని పాత్ర‌లో మెరిసిన చంద‌మామ‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

Ads

ALSO READ : అలీ ప‌క్క‌న న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌..కార‌ణం ఏంటో తెలుసా..!

గ్లామ‌ర్ రోల్స్ అయినా ఫ్యామిలీ చిత్రాలు అయినా కాజ‌ల్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకుంది. టాలీవుడ్ లోనే అందాల చంద‌మామ అని పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండ‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌ర్భం దాల్చిన సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లు ను వివాహం చేసుకున్న కాజ‌ల్ త్వ‌ర‌లోనే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతుంది.

 

రీసెంగ్ గా కాజల్ బేబీ బంప్ ఫోటోల‌ను షేర్ చేసి కాజ‌ల్ ఈ విష‌యాన్ని అంద‌రితో పంచుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సీమంతం సెల‌బ్రేష‌న్స్ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌లో జ‌రిగాయి. కాగా కాజ‌ల్ సీమంతం కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కాజల్ ప్ర‌స్తుతం సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ చిరంజీవి హీరోగా న‌టించిన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా విడుద‌లకు సిద్దంగా ఉంది. అంతే కాకుండా స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన బాలీవుడ్ సినిమా హే సినామిక‌లో కూడా కాజ‌ల్ న‌టించింది. ఈ చిత్రం వ‌చ్చే నెల 3న విడుద‌ల కానుంది.


You may also like