కాజల్ అగర్వాల్ ను తమ సినిమాలకు దూరం పెడుతున్న దర్శక నిర్మాతలు! : హీరోయిన్ కాజల్ అగర్వాల్.. గత ఏడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె ఆచార్య సినిమాలో నటించింది. దీంతో పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమేనని కాజల్ ఫ్యాన్స్ చాలా ఆనందపడ్డారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె సినిమాలను వదులుకుంటుంది.
ఇప్పటికే నాగార్జున ఘోస్ట్ సినిమా నుంచి కాజల్ బయటకు వచ్చింది. రీసెంట్‌గా ఇండియన్ 2 నుంచి కూడా బయటకు వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇండియన్ 2 సినిమా అయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఆమె ప్రగ్నంట్ అవ్వడంతో ఆమెను తొలగించి వేరే వాళ్ళను పెట్టుకుందానే అనే ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు.
Advertisement
Also Read: సరిలేరు సినిమాకు విజయశాంతి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే…?
Advertisement
ఇక ఇండియన్ 2 చిత్రానికి మొదటి నుంచి కూడా అన్నీ కష్టాలే అని చెప్పాలి. గతంలో ఆ చిత్ర షూటింగ్ సెట్‌లో ఘోర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత కరోనా ఇలా ఏదోఒకటి దీనికి అడ్డంకిగానే తయారయింది. ప్రస్తుతం కాజల్. పదిహేనేళ్లకు పైగానే దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలతో పాటు అడపా దడపా బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి తనదైన గుర్తింపు సంపాదించుకుంది.
అంతే కాదండోయ్ డిజిటల్ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత భర్త గౌతమ్ కిచ్లుని బిజినెస్ వ్యవహారాల్లోనూ ఆమె తోడుగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో ఆయనకు జోడీగా నటించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదలవుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా కాజల్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుని ఇండస్ట్రీకి తీసుకొస్తుందట. గౌతమ్ కిచ్లుని లుక్ పరంగా చూడటానికి చక్కగా ఉంటాడు. అందులోనూ చందమామకి ఇండస్ట్రీ గురించి అన్ని లోటుపాట్లు తెలుసు. అలాగే పరిచయాలు కూడా ఎక్కువే మరి ఆ పరిచయాలతో భర్తను ఇండస్ట్రీకి తీసుకువస్తుందా లేదంటే ఇదంతా కేవలం గాసిప్‌కే పరిమితమా అన్నది వేచి చూడాలి.