Home » కాజ‌ల్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తా..? ఆ ఫోటోకు అర్థం ఏమిటి..?

కాజ‌ల్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తా..? ఆ ఫోటోకు అర్థం ఏమిటి..?

by Bunty
Ad

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ పరిచయమై టాప్ హీరోయిన్ ఎదిగిన నటి కాజల్ అగర్వాల్. మ‌గ‌ధీర వంటి హిట్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో కొద్ది రోజుల పాటు టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ త‌రువాత అగ్ర హీరోల స‌ర‌స‌న వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ బిజినెస్‌మేన్ గౌతమ్ కిచ్లుని 2020లో వివాహం చేసుకున్న‌ది.

Advertisement

ఈ ఏడాది అక్టోబర్ 30న వారి మొదటి వార్షికోత్సవం జరుపుకున్న‌ది ఈ జంట. అయితే ఇటీవల తన సినిమాలను తగ్గించుకుంది కాజల్. దీంతో అప్పటి నుంచి ఆమె గర్భవతని అందుకే మూవీస్ ఎక్కువగా సైన్ చేయట్లేదని వార్తలు హల్‌చల్ చేశాయి. కాగా తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో కొంచెం బెబీ బంప్‌లా కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ మరోసారి ప్రచారంలోకి జరుగుతోంది. అందుకే ఇప్పటికే సైన్ చేసిన కొన్ని సినిమాల నుంచి తప్పుకుందని రూమర్స్ వచ్చాయి.

Advertisement

అంతేకాకుండా ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. తన పిల్లలంటే చాలా ఇష్టమని, కానీ పిల్లలని కనాలంటే అదోరకమైన భయం అవరిస్తుందని తెలిపింది. ఈ విషయం ఎంతవరకు నిజమో కాజల్ దంపతులు చెబితే కానీ తెలియదు. సోష‌ల్ మీడియాలో మాత్రం ఎవ‌రికీ న‌చ్చిన‌ట్టు వారు వారి గురించి ర‌క‌ర‌కాలుగా పోస్టులు చేస్తున్నారు. దీనిపై వారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మ‌రీ.

Visitors Are Also Reading