తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తరం నటులు దాదాపుగా ఇండస్ట్రీకి దూరమైనట్టే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ,శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ, కైకల సత్యనారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తరం నటులు ఎంతోమంది ఉన్నారు. దాదాపుగా వారంతా మరణించారు. ఆ తరం నటుల్లో యముడి పాత్రలు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది కైకాల సత్యనారాయణ మాత్రమే. యముడు ఎలా ఉంటాడో మనందరికీ తెలియదు.కానీ సత్యనారాయణ ను చూసి యముడు ఇలానే ఉంటాడు కావచ్చు అని చాలామంది అనుకుంటారు. ఆ విధంగా యముడి పాత్ర అంటే సత్యనారాయణకే బ్రాండ్ గా చెప్పవచ్చు. అలాంటి నట దిగ్గజం దివికేగిసింది. దీంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా కన్నీరు మున్నీరయింది. ఆయన అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పవచ్చు.
Advertisement
also read:TSPSC New Notification: గుడ్ న్యూస్.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల..
Advertisement
మరి ఇన్ని సినిమాల్లో యముడు పాత్రలు చేసిన కైకాల సత్యనారాయణ యమదొంగ సినిమాలో ఎందుకు చేయలేదో ఇప్పుడు తెలుసుకుందాం. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ మూవీలో యముడి పాత్ర కోసం సత్యనారాయణ ను ముందుగా సంప్రదించారని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. నీకు యముడు పాత్రలంటే అంత ఎందుకు ఇష్టం అని ప్రశ్నించగా .. మొదటిసారిగా యమగోల లో నేను రామారావు కలిసి చేసాం. అప్పట్లో ఈ పాత్రలో మేమిద్దరం పోటాపోటీగా చేసేవాళ్లం..
మొదట్లో నన్ను దుర్యోధనుడిగా పనికిరావని అన్నారు.. కానీ చివరికి రామారావు వారందరినీ తిట్టి మరీ నన్ను సూచించారు. ఎప్పుడైనా సరే యముడు పాత్ర వస్తే ఆయనకు నాకు పోటీ. ఆ తర్వాత చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమాలో చేశాను. అలా యమలీల, పిట్టలదొర సినిమాల్లో యముడి పాత్ర అంటే నేనే అన్నట్లు తయారైంది. రామారావు వేసిన పాత్రల్లో రాముడు,కృష్ణుడు తప్ప అన్ని వేషాలు వేశానని ఆయన అన్నారు. యమదొంగ సినిమాలో అవకాశం వచ్చినా డబ్బుల విషయంలో తేడా రావడంతో నేను చేయనని చెప్పానని ఆ ఇంటర్వ్యూ లో తెలియజేశారు కైకాల సత్యనారాయణ.
also read: