తెలుగు చలన చిత్ర రంగంలో మహానుభావులు చాలా మందే ఉన్నారు. వారిలో మహానటుడు కైకాల సత్యనారాయణ స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. నవరస నటుడు, నటన సార్వభౌముడిగా విలక్షణ నటుడిగా ఆయన పోషించిన పాత్ర అనిర్వచనీయం. 1935లో కృష్ణా జిల్లాలో బంటవెల్లి గ్రామంలో జులై 25న జన్మించారు కైకాల. నటన రంగంలో ఓ వెలుగు వెలిగారు. 1958లో విడుదలైన సిపాయి కూతురు చిత్రంలో తెలుగు సినీ ఇండస్ట్రీకీ పరిచయం అయ్యారు.
Advertisement
కెరీర్ తొలి రోజుల్లోనే చాలానే కష్టపడ్డాడు. ఇలాంటి కష్టకాలంలో కైకాల సత్యానారాయణకు ఎన్టీఆర్ అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్ ప్రతీ సినిమాలో సత్యానారాయణకు అవకాశం కల్పించారు. ఆ తరువాత కైకాల నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ గా ఎదుగుతూ వచ్చాడు. తనకు అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ అంటే ఆయనకు ఎనలేని గౌరవం ఎన్టీఆర్ మాట సత్యనారాయణ తరుచూ తప్పకుండా పాటిస్తూనే వచ్చేవారు. ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ మాట వినలేదు. ఆయన మాటను కాదని మరీ ఓ సినిమాలో నటించాడు. ఆ సందర్భం ఏమిటంటే ఎన్టీఆర్ దర్శక, నిర్మాతగా త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన ధానవీరశూరకర్ణ, సినిమా స్థాయి ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
Also Read : IPL 2022 : మెగా వేలంలో సురేష్ రైనాను ఎందుకు కొనుగోలు చేయలేదో చెప్పిన సీఎస్కే సీఈఓ..!
Advertisement
తెలుగు సినిమా అజరామం దానవీర శూరకర్ణ. కానీ ఈ సినిమాను తెరకెక్కించే సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఇదే సమయంలో కురుక్షేత్రం సినిమాను అనౌన్స్ చేసి నటీనటులందరినీ బ్లాక్ చేశారు. దీంతో నటీనటుల విషయంలో కాల్సీట్లు సమస్య తలెత్తింది. దీనిని ముందుగానే అంచనా వేసిన ఎన్టీఆర్ ధానవీర శూరకర్ణలో నటించిన నటులెవ్వరూ కూడా కురుక్షేత్రం సినిమా నటించకూడదని షరతు పెట్టారు. అదేవిధంగా దాణవీరశూరకర్ణ సినిమా షూటింగ్ అయినంత కాలం ఏ నటుడు కూడా మాంసాహారం తినకూడదు అని షరతు కూడా పెట్టాడు. మాధవ రంగారావు మాంసాహారాన్ని వదిలేయడానికి అంగీకరించలేదు. దీంతో పక్కన సెట్లో ఆయన స్థానంలో అర్జునుడి పాత్రను నటించడానికి నందమూరి హరికృష్ణను సిద్ధం చేశారు. ఎన్టీఆర్ రూల్స్ విషయంలో అంత స్టిక్ట్గా ఉంటాడు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. కైకాల సత్యనారాయణ అప్పటికే కురుక్షేత్రం సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడు. దీంతో దానవీరశూరకర్ణ సినిమాలో నటించాలా వద్దు అని అయోమయంలో పడ్డారు కైకాల. కైకాల వంటి నటుడుని వదులుకోవడం ఇష్టంలేని ఎన్టీఆర్ ఆయనకు మాత్రమే రెండు సినిమాల్లో నటించేందుకు వెసులుబాటు కల్పించారు. కేవలం 43 రోజుల్లో తెరకెక్కించిన దాన వీర శూరకర్ణ సినిమా సూపర్ హిట్ కాగా.. కురుక్షేత్రం సినిమాలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ రెండు సినిమాల్లో సత్యానారాయణ పాత్రం ఎంతగానో పేరు లభించింది. ఎన్టీఆర్ పెట్టిన రూల్ను బ్రేక్ చేసిన నటుడిగా కైకాల సత్యనారాయణ నిలిచిపోయారు.
Also Read : IPL 2022 Mega Auction : విధ్వంసకరమైన ఆటగాళ్లతో గుజరాత్ టైటాన్స్ జట్టు