Home » కార్తీకదీపం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్న వంటలక్క..!!

కార్తీకదీపం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్న వంటలక్క..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో డైలీ సీరియల్స్ లో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఇందులో దీప క్యారెక్టర్ తో ఒక స్టార్ హీరో కు ఏ విధంగా క్రేజ్ వస్తుందో ఆ విధామైన క్రేజ్ ను అందుకుంది దీప. వంటలక్క గా మనందరికీ ఎంతో దగ్గరైపోయిందో మనందరికీ తెలిసిందే. అలా అందరి హృదయాలను దోచుకుంది ప్రేమి విశ్వనాథ్.. ఇక కార్తీకదీపం సీరియల్ లో ఫస్ట్ జనరేషన్ అయిపోవడంతో దీప సీరియల్ నుండి తప్పుకుంది. సీరియల్ లో కనిపించదు అనే వార్త అభిమానులను చాలా బాధ పెట్టింది అని చెప్పవచ్చు..

Advertisement

మీరు సీరియల్ లో తప్పకుండా ఉండాలి మీరు లేకుండా సీరియల్ ఊహించడం చాలా కష్టమని కామెంట్స్ పెట్టారు అభిమానులు. సెకండ్ జనరేషన్ లో కూడా ఈ సీరియల్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అంతే టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఈ సీరియల్ కు సంబంధించిన ఒక లేటెస్ట్ విషయం ప్రేమీ విశ్వనాథ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీన్ని చూసి అభిమానులందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే..మీకోసం నేను మళ్ళీ వస్తున్న అంటూ.. షాట్ రెడీ అంటూ షూటింగ్ కోసం రెడీ అయ్యే వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

దీన్నిబట్టి అభిమానులంతా మన వంటలక్క మళ్లీ కార్తీకదీపం సీరియల్ లో అలరించబోతోందని అర్థం చేసుకుంటున్నారు. ఆమె రాక కోసం ఎదురు చూసిన చాలా మంది అభిమానులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. మీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను మీరు మమ్మల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading