Home » విశ్వనాథ్ వారసులు సినిమాల్లోకి ఎందుకు రాలేదు…కారణం ఇదే…!

విశ్వనాథ్ వారసులు సినిమాల్లోకి ఎందుకు రాలేదు…కారణం ఇదే…!

by AJAY
Published: Last Updated on

సినిమా ఇండస్ట్రీ లో వారసత్వం ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే…ఇప్పటికే చాలా మంది సీనియర్ హీరోలు దర్శకులు తమ వారసులను ఇండస్ట్రీ కి పరిచయం చేయగా వాళ్ళు కూడా స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల లెజెండరీ దర్శకుడు కె. విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

వృద్ధాప్యం తో వచ్చిన అనారోగ్య కారణాల వల్ల ఆయన కన్ను మూశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు ఆయన సూపర్ హిట్ లను అందించారు. దర్శకుడిగా నే కాకుండా నటుడిగా కూడా ఆయన సినిమాలు చేశారు. అయితే ఇండస్ట్రీ లో ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ తన వారసులను మాత్రం ఆయన ఇండస్ట్రీ కి పరిచయం చేయలేదు.

విశ్వనాథ్ గారికి ముగ్గురు సంతానం కాగా ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వాళ్ళను ఇండస్ట్రీ కి ఎందుకు పరిచయం చేయలేదో ఆయన ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. నేను ఇండస్ట్రీ లో సక్సెస్ అయిన విధంగా నా పిల్లలు సక్సెస్ అవుతారని నమ్మకం లేదు…అందుకే వారిని ఇండస్ట్రీ కి పరిచయం చేయలేదు అని చెప్పారు.

అందుకే వారిని బాగా చదివించి ఇతర రంగాలలో స్థిరపడేలా చేశానని చెప్పారు. అంతే కాకుండా నా పిల్లలు ఇండస్ట్రీ లోకి వస్తే నాకు దక్కిన గౌరవం మర్యాదలు వాళ్లకు దక్కాలని లేదని అన్నారు. ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలని అన్నారు. నా కుమారులు ఫలానా కంపెనీ లలో మేనేజర్ లుగా పని చేస్తున్నారని చెప్పడానికి గర్వ పడుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading