Home » శంక‌రాభ‌ర‌ణం కంటే ముందు కె.విశ్వ‌నాథ్ తీసిన 4 సినిమాలు- వాటి విశేషాలు

శంక‌రాభ‌ర‌ణం కంటే ముందు కె.విశ్వ‌నాథ్ తీసిన 4 సినిమాలు- వాటి విశేషాలు

by Azhar
Ad

శంక‌రాభ‌ర‌ణం సినిమాతో కె.విశ్వ‌నాథ్ గురించి సినీ ఇండ‌స్ట్రీతో పాటు సామాన్య జ‌నాల్లో కూడా ఒక్క‌సారిగా పెద్దఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ఈ సినిమా హిట్ త‌ర్వాత ఆయ‌న సినిమాలు ఎక్కువ‌గా సెన్సిబుల్ క‌థాంశాల చుట్టూ తిరిగాయి. ఈ సినిమాకు ముందు కె.విశ్వ‌నాథ్ 4 సినిమాలు తీశారు. ఆ సినిమాలేంటి వాటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం!

ఆత్మగౌరవం:
1966 లో కె. విశ్వనాథ్ డైరెక్ష‌న్ లో వచ్చిన ఈ సినిమాలో ANR, కాంచనలు హీరోహీరోయిన్స్ గా న‌టించారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ప్రముఖ క‌వులుగా పేర్గాంచిన దాశ‌ర‌థి, సినారె, శ్రీశ్రీ, ఆరుద్ర‌లు ఈ సినిమాకు పాటలు రాయండం విశేషం!

Advertisement

అల్లుడు పట్టిన భరతం:
1980లో కె. విశ్వనాథ్ డైరెక్ష‌న్ లో వచ్చిన ఈ సినిమాలో… కృష్ణం రాజు, జయసుధ, నూతన్ ప్రసాద్ లు లీడ్ రోల్స్ లో న‌టించారు. ఈ సినిమా యావ‌రేజ్ గా ఆడింది.

Advertisement

సిరిసిరిమువ్వ :
1976 లో కె. విశ్వనాథ్ డైరెక్ష‌న్ లో వచ్చిన ఈ సినిమాలో చంద్ర‌మోహ‌న్, జ‌య‌ప్ర‌ద‌లు హీరోహీరోయిన్స్ గా న‌టించారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఝుమ్మంది నాదం…సయ్యంది పాదం అనే పాట ఈ సినిమాలోనిదే! “సర్‌గమ్” అనే పేరుతో ఈ సినిమా హిందీలోకి రిమేక్ చేయ‌బ‌డింది.

సీతామాలక్ష్మి:
1978 లో కె. విశ్వనాథ్ డైరెక్ష‌న్ లో వచ్చిన ఈ సినిమాలో చంద్ర‌మోహ‌న్, రామేశ్వ‌రి జంట‌గా న‌టించారు. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నటనకు గాను రామేశ్వ‌రికి నంది అవార్డ్ వ‌చ్చింది. ఈ సినిమాను 1980 లో హిందీలో సితార గా రిమేక్ చేశారు.

Visitors Are Also Reading