తాజాగా భారత్-సౌతాఫ్రికా మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. తోలి ఇన్నింగ్స్ లో టీం ఇండియా 245 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. కాగా, సౌత్ ఆఫ్రికా తోలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి, మూడవ రోజు ఆటని కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా లో గొప్ప బ్యాటర్ కె ఎల్ రాహుల్ సెంచరీ కొట్టి ఇరగదీసాడు. గాయం తరువాత కె ఎల్ రాహుల్ మరింత వేగం పుంజుకున్నారనే చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను రాహుల్ సమర్ధవంతంగా ఎదుర్కోగలిగారు.
Advertisement
అయితే.. ఈ మ్యాచ్ లో రాహుల్ చాలా చాకచక్యంగా ఆడారని చెప్పాలి. బైస్ రూపంలో ఓ పరుగుని తస్కరించేసారు కూడా. కానీ, ఆ మూమెంట్ లో ఈ స్టెప్ ని ఎవ్వరూ గమనించలేదు. ఈ మూమెంట్ ని చాలా మంది గమనించి ఉండరు. కె ఎల్ రాహుల్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఉన్నపుడు 66వ ఓవర్ మొదటి బంతికి మొహమ్మద్ సిరాజ్ 9వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అప్పటికే ఇండియా స్కోర్ 238. అయితే.. రాహుల్ సెంచరీ పూర్తి చేస్తేనే మంచి ఇన్నింగ్స్ వస్తాయి.
Advertisement
66వ ఓవర్ సమయంలో, కోయెట్జీ వేసిన బంతిని శక్తివంతమైన సిక్సర్‌తో రాహుల్ సెంచరీని అందుకున్నాడు. అయితే, ఆ ఓవర్ 3వ బంతికి రాహుల్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ తెలివిగా బైను దొంగిలించడంతో కీలక క్షణం ఏర్పడింది. రాహుల్ 95* వద్ద ఉండగా, కోయెట్జీ మొదటి బంతికే మహ్మద్ సిరాజ్‌ను అవుట్ చేశాడు. ప్రసిద్ధ్ రెండు బంతులు ఎదుర్కొన్నప్పుడు, అతను మరియు రాహుల్ వికెట్ కీపర్ కైల్ వెర్రెయిన్ అలసత్వాన్ని ఉపయోగించుకుని బైస్ రూపంలో సింగల్ ని పొంది స్ట్రైక్ లోకి వచ్చాడు. ఈ స్టెప్ తీసుకోకుండా ప్రసిద్ధ్ అవుట్ అయ్యి ఉంటె ఇండియా ఇన్నింగ్స్ అయిపోయేవి. రాహుల్ 95 నాట్ అవుట్ గా ఉండిపోయేవాడు. ఈ టైం లో తెలివిగా ఆడడం ప్లస్ పాయింట్ అయ్యింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!