Home » ఆ కారణంగానే సూర్యను జ్యోతిక పెళ్లి చేసుకుందా..? లవ్ స్టోరీని రివీల్ చేసిన జ్యోతిక..!

ఆ కారణంగానే సూర్యను జ్యోతిక పెళ్లి చేసుకుందా..? లవ్ స్టోరీని రివీల్ చేసిన జ్యోతిక..!

by Anji
Ad

కోలీవుడ్ లో అందమైన కపుల్స్ అంటే.. అందరూ వెంటనే చెప్పే పేరు సూర్య జ్యోతిక. 2006లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. జ్యోతిక ఓ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సూర్యకు అంతగా గుర్తింపు లేదు. కానీ అవేవీ పట్టించుకోకుండా సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది జ్యోతిక. సూర్య నువ్వు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనలో ఎలా వచ్చిందో ఇంటర్వ్యూలో తెలిపింది జ్యోతిక. ఇటీవలే జ్యోతిక 45వ పుట్టినరోజును జరుపుకున్నారు. వారి మధ్య ప్రేమ పెళ్లి అని కూడా నెలరోజుల వ్యవహారిలోనే జరిగిపోయినట్టు చెప్పుకొచ్చారు.

Advertisement

తనకు సూర్య ఇచ్చే గౌరవం వల్లనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పూ వెల్లమ్ కెట్టుప్పర్  అనే సినిమాలో తాము కలిసి నటించిన సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని జ్యోతిక తెలిపారు అలా తామిద్దరం కలిసి ఏడు సినిమాల్లో నటించామని చెప్పారు. సినిమాలో భాగంగా రోమా**టిక్ శీను ఉన్న సమయంలో దర్శకుడు సూచన మేరకు మాత్రమే పరిమితమై సూర్య నటిస్తాడు. దానిని అదునుగా ఏమాత్రం తీసుకోడు. అలా మహిళల పట్ల ఆయన ఇచ్చే గౌరవమే తనను ఎక్కువగా ఆకర్షించే విధంగా చేసినట్టు జ్యోతిక చెప్పుకొచ్చారు. సూర్యను పెళ్లి చేసుకునే సమయానికి తాను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటిందని చెప్పారు. రోజంతా షూటింగ్ పనుల వల్ల బాగా అలసిపోయేదాన్ని అప్పటికే తనకు అవసరమైనంత మొత్తంలో డబ్బు సంపాదించడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నట్లు జ్యోతిక తెలిపారు.

Advertisement

ఇక అలాంటి సమయంలోనే తొలత సూర్య తనకు ప్రపోజ్ చేశాడని చెప్పారు. సూర్య గురించి ఇంట్లో తన తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత వారు కూడా తమ పెళ్ళికి అంగీకరించాలని చెప్పారు. దీంతో తమ ఇద్దరం ఒకటయ్యామని ఆమె వెల్లడించారు. ఇంటర్వ్యూలో సూర్య గురించి జ్యోతిక ఇలా చెప్పారు. ఒక తండ్రిగా సూరిగా చాలా సిన్సియర్ గా ఉంటాడు భర్తగా కూడా సిన్సియర్ గా ఉండడమే కాకుండా తనకు సరైన గౌరవం ఇస్తాడు. నాతో సూర్యను చూసిన వారందరూ అతని చూసి నేర్చుకోమని తమ భర్తలకు చాలామంది మహిళలు చెప్పడం ప్రత్యక్షంగా నేను చూశాను. సూర్య ప్రతి ఆనంద క్షణాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాడని.. ఇలా ప్రతి విషయంలో సూర్య తనకు ఎంతో స్పెషల్ అని జ్యోతిక చెప్పుకొచ్చింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

జయహో సాంగ్‌ కపోంజ్‌ చేసింది రెహమాన్ కాదా..? నెట్టింట్లో వైరల్

 టైగర్ నాగేశ్వరావు మూవీ కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా ?

 

Visitors Are Also Reading