Home » june 7th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 7th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

modi

ప్రధాని నరేంద్ర మోడీ నేడు జిహెచ్ఎంసి కార్పొరేటర్ ల తో భేటీ కానున్నారు. హైదరాబాద్ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. దాంతో నేడు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధానితో కార్పొరేటర్లు భేటీ కానున్నారు. ఈ భేటీలో బీజేపీ చీఫ్ సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు.

Advertisement

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అవిశ్వాస తీర్మానం లో నెగ్గారు. ఆ దేశ పార్లమెంట్ నుండి జాన్సన్ కు 211 మంది సభ్యుల మద్దతు లభించింది.

బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు పై అబిడ్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 228 కింద రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్నీసియా పబ్ ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను విడుదల చేసినందుకు రఘునందన్ రావు పై కేసు నమోదైంది.

చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత రవి ఇంటి పై వైసీపీ నేతలు దాడి చేశారు. అర్థరాత్రి 1 గంట సమయంలో మద్యం సీసాలు, రాళ్లతో టీడీపీ నేత రవి ఇంటిపై దాడి చేశారు. తిరుపతి గంగమ్మ ఆలయ విషయంలోనే దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

నేడు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఉదయం 10.00 గం.లకు తాడేపల్లి నుంచి బయలు దేరి, 10.40 గం.లకు గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో సభా వేదిక నుంచి సీఎం ప్రసంగిస్తారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకాన్ని సీఎం జెండా ఊపి ప్రారంభించనున్నారు.

సీఎం జగన్ సర్కార్ రూ. 691 కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసింది. వ్యవసాయ పని ముట్ల కోసం 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం జమచేసింది.

కర్నూలు జిల్లాలో 12 స్కూళ్లలో టెన్త్ లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 33 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.

నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరగనుంది. 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల పరిశీలకులుగా ఎం.సురేష్ కుమార్ ఉన్నారు.

తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,326 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడదల కానుంది. తొలి దశ నోటిఫికేషన్‌కు ఏర్పాట్లు చేయాలని మెడికల్ బోర్డుకు మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలని సూచించారు.

కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులు విడుదల చేసింది. ఏపీతో సహా 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్ల నిధులను విడుదల చేసింది. జూన్ నెలకు సంబంధించి ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.879.08 కోట్లు విడుదల చేశారు.

Visitors Are Also Reading