Home » june 6th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 6th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఆమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసులో టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కీలకం గా మారింది. ఇప్పటికే ఇన్నోవా కారులో క్లూస్‌ టీం ఆధారాలను సేకరించింది. కారులో సరిపడా ఆధారాలు లభించకపోవడంతో టెక్నికల్‌ ఎవిడెన్స్‌పైనే దృష్టి పెట్టింది.

చార్‌ధామ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. బస్సు ఉత్తరాఖండ్‌లో లోయలో పడిపోవడం తో 17 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విచారం వ్యక్తం చేశారు.

Advertisement

modi

గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. కార్పొరేటర్లకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని గతంలో బండి సంజయ్ హామీ ఇవ్వడం తో ఈ టూర్ ఖరారు అయ్యింది.

కర్నూలులో గాలి బీభత్సం సృష్టించింది. దాంతో విరాటపర్వం ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో డిజిటల్ స్క్రీన్స్ కూలిపోయాయి. విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు. రానా, సాయిపల్లవి వేదికపైకి రాకముందే ఈ ఘటన చోటు చేసుకుంది.

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరేళ్ల పాటు పార్టీ నుంచి నుపుర్ శర్మను సస్పెండ్ చేస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

థర్మల్ ప్లాంట్ వల్ల పర్యావరణానికి నష్టం కలిగింది అనే కారణంతో ఆదాని గ్రూప్స్ కు జాతీయ హరిత ధర్మాసనం 52 కోట్ల జరిమానా విధించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కేంద్రం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశాన్ని హ్యాండిల్ చేసే శక్తి బిజెపికి లేదన్నారు. ముష్కరుల వల్ల పండిట్ లు వలస వెళ్లాల్సి వస్తుందని అన్నారు. దాడులను ఆపేందుకు వెంటనే కేంద్రం కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

నైజీరియాలో ఒక చర్చిపై ఉగ్రవాదుల తుపాకులు, బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో 50 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఒండో రాష్ట్రం లోని సెయింట్ ప్రావిన్స్ కాతలిక్ చర్చ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఏపీలో నిన్నటి నుండే కడప, కర్నూలు, విశాఖ చిత్తూరు, ఒంగోలు, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది.

ఢిల్లీ హెల్త్ అండ్ హోమ్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇంట్లో ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు. కోల్ కత్తాకు చెందిన ఒక కంపెనీతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడి సోదాలు చేపడుతోంది.

Visitors Are Also Reading