Home » june 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ హెడ్ ఎక్విప్‌మె౦ట్‌పై హై టెన్షన్ వైర్లు తెగిప‌డ్డాయి. దాంతో ఉదయం 5 గంటల వరకు పలు రైళ్ల రాకపోకలకు అంత‌రాయం ఏర్ప‌డింది. దాంతో వెంట‌నే సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని సాంకేతిక స‌మ‌స్య‌ను చ‌క్క‌దిద్దారు. అంత‌రాయం వ‌ల్ల విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం ఆల‌స్యం అయ్యాయి.

కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై కరస్పాండెంట్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. కొన్ని నెలలుగా క‌ర‌స్పాండెంట్ ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో బాలికను తల్లిదండ్రులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కరస్పాండెంట్‌ విజయ్‌ కోసం పోలీసుల గాలిస్తున్నారు.

Advertisement

అత్యాచారం కేసులో నిందితుల్లో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నార‌ని ఏఐసీసీ ఇన్ ఛార్జి మానిక్క‌మ్ ఠాగూర్ అన్నారు. వీడియోను బహిర్గతం చేసి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బాధితురాలు, ఆమె కుటుంబం కేసు , భద్రత రెండింటిలో రాజీపడ్డారని అన్నారు. టీఆర్ ఎస్, ఎంఐఎం, బీజేపీ ల మధ్య అపవిత్ర బంధమా? మైనర్ బాలికకు న్యాయం కంటే వారి బంధమే ముఖ్యమా? అంటూ ప్ర‌శ్నించారు.

వైసీపీ ఎమ్మ్యెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి పై టీడీపీ నాయుకులు బుద్దా వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. జ‌గ‌న్ హ‌త్య‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆరోపించారు. ప‌ల్నాడులో రెచ్చిపోతున్న పిన్నెల్లిని బ‌హిరంగంగా ఎన్కౌంట‌ర్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

modi

Advertisement

యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పై ప్ర‌ధాని మోడీ ప్ర‌శంస‌లు కురిపించారు. నేడు యోగి 50వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్న‌నేప‌థ్యంలో శుభాకాంక్ష‌లు తెలిపారు. యెగి పాల‌న‌లో యూపీ కొత్త శిఖ‌రాకు చేరుకుంటుంద‌ని అన్నారు.

మ‌ర‌ణించిన త‌ర‌వాత ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని చెన్నై లో ఓ న్యాయ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స‌ల్మాన్ అనే విద్యార్థి లా చ‌దువుతున్నాడు. ఇటీవ‌ల ఇంటికి వెళ్లి వ‌చ్చిన స‌ల్మాన్ అప్ప‌టి నుండి నిరాశ‌గా ఉంటున్నాడ‌ట‌. కాగా అత‌డు త‌న సూసైడ్ నోట్ లో మ‌ర‌ణం త‌ర‌వాత ఏం జ‌రుగుతుందో తెలుసుకోవడానికే ఆత్మ‌హత్య చేసుకుంటున్నా అంటూ పేర్కొన్నాడు.

తిరుమ‌ల వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో వెళితే రోజూ వెయ్యి మందికి రూ.300 విలువ చేసే ద‌ర్శ‌న టికెట్ లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటి వద్ద విమానం కలకలం రేపింది. నో ఫ్లైయింగ్ ఏరియాలోవిమానం చక్కర్లు కొట్టడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే బైడెన్ దంపతులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రతినెల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇందిరానగర్ పంచాయతీ సర్పంచ్ శారదా ప్రవీణ్ ప్రకటించారు. సర్కారీ బడుల బలోపేతం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో గడచిన 24 గంటల్లో 4,270 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది కరోనా తో మృతి చెందారు.

Visitors Are Also Reading