Home » june 4th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 4th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని నీమ్‌ ట్రీ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెస్టారెంట్ లో భారీగా మంటలువ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్నవారిని వెంటనే పోలీసులురక్షించడం తో ప్రమాదం తప్పింది.

హైదరాబాద్ లోని క్లబ్‌ మస్తీపబ్‌పై మాదాపూర్‌ ఎస్వోటీ పోలీసుల దాడులు నిర్వహించారు. అశ్లీల నృత్యాలతో ఈ పబ్ లో గబ్బు లేపుతున్నారు. యువతులతో అర్థనగ్నంగా నృత్యాలు చేయించడం తో పాటు కస్టమర్ల కోసం యువతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసారు.

Advertisement

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య స్టేజ్ మీద ఓ పెద్ద హీరో డాన్స్ కూడా చేశాడు…. ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పించడానికి హీరో, హీరోయిన్స్ ప్రమోషన్ చేసుకోవాలని చెప్పాడు.

కోనసీమ ఘటనపై కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమలో జరిగిన ఘటనలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని పవన్ హామీ ఇచ్చారు.

జూబ్లీ హిల్స్ పబ్ లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర స్పందించారు. ఆ యువకులు ఎవరో తనకు తెలియదని…. కానీ వార్తల్లో ఉద్దేశించిన ప్రస్తావన సరికాదన్నారు. వాళ్లు పలుకుబడి ఉన్న కుటుంబాల వారు కాదని సంస్కృతి మానవతా విలువలు సరైన పెంపకం తెలియని దిగువ స్థాయి కుటుంబాల వారు అనడం సరైనదని అన్నారు.

Advertisement

ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష నిర్వహించనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 6 నుండి హాల్ టిక్కెట్ లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం ఇటీవల హేమంత్ సోరెన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కేసీఆర్ హేమంత్ సోరెన్ తో సమావేశం అవ్వడం రాజకీయాల్లో చర్చగా మారింది.

modi

ప్రధాని నరేంద్ర మోడీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల భారీ విగ్రహాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు.

దేశం లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,922 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 మంది వైరస్ తో మరణించారు. 2,697 మంది కోలుకున్నారు.

Visitors Are Also Reading