Home » june 30th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 30th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాడ సారె ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. దాంతో భ‌క్తుల కోసం ఏర్పాట్లు చేశారు.

సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తెగిప‌డ్డాయి. దాంతో మంటలు చెలరేగి 8 మంది సజీవదహనం అయ్యారు. మృతులు గడ్డంపల్లి వాసులుగా గుర్తించారు.

Advertisement

ఫడ్నవీస్‌ మూడోసారి మహారాష్ట్ర సీఎం అయ్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. తమకు 161 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఫడ్నవీస్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

త‌మ ప్రభుత్వం పతనం వెనుక కేంద్రం కుట్ర ఉందంటూ శివ‌సేన అధినేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మా వాళ్లే.. పరాయి వాళ్లయ్యారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మహావికాస్‌ అఘాడీకి ప్రత్యర్థుల దిష్టి తగిలిందని అన్నారు. మా ప్రభుత్వానికి అదృష్టం కలిసి రాలేదని వ్యాఖ్యానించారు. శరద్‌ పవార్‌, సోనియాకు కృతజ్ఞతలు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం థాక్రే వ్యాఖ్యానించారు.

Advertisement

ఓటీటీలో సినిమాల విడుదలపై నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాల‌ని నిర్న‌యం తీసుకున్నారు. జులై 1 నుంచి విడుదలయ్యే సినిమాలన్నీంటికీ నిబంధన వర్తిస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. జులై 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్నారు. జులై 19న నామినేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీగా నిర్న‌యించారు. జులై 20న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ. ఆగస్టు 6న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇక‌ అదేరోజు కౌంటింగ్ కూడా పూర్తి చేయ‌నున్నారు.

modi

ప్రధాని మోడీ పర్యటనకు వ‌స్తున్న నేప‌థ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మోడీ పర్యటన ఉన్నంతసేపు మూడంచెల భద్రత క‌ల్పిస్తున్నారు.

హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ గా అమ‌య్ కుమార్ నియ‌మితుల‌య్యారు. క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ నేడు ఉద్యోగ విర‌మ‌ణ పొందుతున్నారు. దాంతో రంగారెడ్డి క‌లెక్ట‌ర్ గా ఉన్న అమ‌య్ కుమార్ కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ సీఎస్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

కొరియా సింగ‌పూర్ ఉపగ్ర‌హాల‌ను పీఎస్ఎల్వీ నేడు నింగిలోకి పంప‌నుంది. సాయంత్రం 6.02 నిమిషాల‌కు ఉప‌గ్ర‌హాల‌ను నింగిలోకి పంపించ‌నుంది.

Visitors Are Also Reading