Home » june 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వంగా ఘనం గా నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం నేతలు మిఠాయిలు పంచుకున్నారు.

 

శబరి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడు మిరాజ్ ను అరెస్ట్ చేశారు. నిందితుడి సమాధానం విని పోలీసులు కంగుతిన్నారు. తనకు పెళ్ళి చేయిస్తానని డబ్బులు తీసుకున్న మహిళ శబరి ఎక్స్ ప్రెస్‌లో వెళుతుందని తెలిసి .. ఆమె బుట్టలో బాంబ్ ఉందంటూ ఫోన్ చేశానని మిరాజ్ విచారణలో చెప్పాడు.

 

ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపికపై బీజేపీ తుది కసరత్తులు జరుపుతోంది. పార్టీ రవీంద్రారెడ్డి పేరును పరిశీలిస్తోన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్థిపై అధికార ప్రకటన విడుదల చేయండి.

 

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో SRPF జవాన్‌ల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతో ఇద్దరు జవాన్‌లు మృతి చెందారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు

 

వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడిని సీఎం జగన్ సస్పెండ్ చేశారు. తనకు పార్టీలతో సంబంధం లేకుండా ఓట్లు పడతాయని సుబ్బారాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలోనే క్రమశిక్షణ కమిటీ సిఫార్సుతో కొత్తపల్లిపై జగన్ చర్యలు తీసుకున్నారు.

 

టడిపి నాయకురాలు దివ్యవాణి చంద్రబాబును కలిసారు. పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళిన్నట్టు చెప్పారు. ఫేక్ వార్తలు.. తప్పుడు సర్క్యులేషన్లు వచ్చినప్పుడు సంయమనంతో ఉండాలని చంద్రబాబు సూచించినట్టు తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 4న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 3న పవన్ కళ్యాణ్ అమరావతికి వెళ్లనున్నారు.

 

సౌరభ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గంగూలీ బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు టాక్. గత నెలలో గంగూలీ రెండు సార్లు అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే.

 

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కమిషనరేట్ పరిధిలో జూన్ 5 నుండి జూలై 24 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

 

ఆగస్ట్ లో టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ టెట్ ను నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విద్యాశాఖ విడుదల చేయనుంది.

Visitors Are Also Reading