Home » june 3rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 3rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఏపీ సీఎం జ‌గ‌న్ పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదని టెండర్‌లో జగన్ ప్రభుత్వం నిబంధన పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉందని విమ‌ర్శించారు. ఇలాంటి నిబంధన దేశంలో మరే రాష్ట్రంలో లేద‌ని అన్నారు.

Advertisement

కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం జ‌రిగింది. కలబురగి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టెంపోను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మృతి చెందారు.

శనివారం ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తారు. ఈ ఏడాది ఫలితాలు గ్రేడ్‌లకు బదులు మార్కుల రూపంలో వెల్లడించ‌నున్నారు.

తెలంగాణలో నేటి నుంచి ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభింన‌నున్నారు. ఈనెల 18 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై షెడ్యూల్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా వైకుంఠధామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి వసతి కల్పించాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది.

Advertisement

ఐపీఎల్ బెట్టింగ్ యువ‌కుడి ప్రాణంతీసింది. మెదక్‌ శివంపేటలో అనిల్ కుమార్ అనే యువ‌కుడు ఐపీఎల్ బెట్టింగ్ ల‌కు పాల్ప‌డి అప్పుల పాలు అయ్యాడు. బెట్టింగ్ కోసం చేసిన దాదాపు రూ.లక్ష అప్పు చేసి అవి తీర్చలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఢిల్లీలో రెండో రోజు ఏపీ సీఎం జగన్ పర్య‌టించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు.

అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోడీ సర్కార్‌ కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోందని జోస్యం ప‌లికారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామ‌ని చెప్పారు. నిజాం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది సర్దార్‌ పటేలే అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.

దేశంలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 4041 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంటల్లో 10 మంది మ‌ర‌ణించారు.

Ap cm jagan

Ap cm jagan

కాంట్రాక్ట్ లెక్చ‌రర్ ల‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మినిమ‌మ్ టైమ్ స్కేలు అమ‌లు చేసి జీతాలు పెంచుతామ‌ని ప్ర‌క‌టించింది. పెరిగిన జీతాలు జ‌న‌వ‌రి 1 నుండి అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

Visitors Are Also Reading