Home » june 29th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 29th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

టాలీవుడ్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్‌ హఠాన్మరణం చెందారు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యాసాగర్ తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా విద్యాసాగర్ పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. 

జూన్ 30న ఉదయం 11 గం.లకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరగనుంది. అదే రోజు బల నిరూపణ జరగనుంది. 8మంది రెబల్ ఎమ్మెల్యేలు గవర్నర్ కు ఇప్పటికే మెయిల్ చేశారు. వెంటనే బలనిరూపణకు ఆదేశించాలని ఈమెయిల్ లో డిమాండ్ చేశారు.

Advertisement

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. రవాణా శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. రాజా బాబుకు రవాణా శాఖ కమిషనర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఎఫ్ఎస్ సునీల్ కుమార్‌కు ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈఓగా బదిలీ చేశారు.

chiranjeevi

chiranjeevi

అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు రావాలని చిరంజీవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. జూలై4న భీమవరం జరిగే ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరు కానున్నారు. అయితే ఈ వేడుకలకు పవన్ కు ఆహ్వానం అందకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ఈ నెల 30న తెలంగాణ లో పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. నిన్న ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను జూలై 1వ తేదీన విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విద్యాశాఖ కు ఆదేశించారు.

తెలంగాణ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపత్యం లో అప్రమత్తం గా ఉండాలని అధికారులను ఆదేశించింది.

నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా 24 క్యారెట్ ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,980 గా ఉంది.

మహారాష్ట్ర లో భారీ పేలుళ్లు సంభవించాయి. తారాపూర్ లోని మిస్ డి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీ లో వరుస పేలుళ్ల తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్ట్ 1నుండి 10వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూలై 26 నుండి 30 వరకు జరుగుతాయి.

Visitors Are Also Reading