Home » june 24th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 24th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

modi

నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు మద్దతు ఇస్తున్న పార్టీల నేతలు హాజరు కానున్నారు. ముర్ము నామినేషన్ పత్రంలో ప్రధాని మోడీ ఇప్పటికే సంతకం చేశారు. జెపి నడ్డాతో సహా పలువురు కేంద్ర మంత్రులునేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఎంపీలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Advertisement

నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అంతే కాకుండా ఈరోజు నుండి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసిపీ మద్దతు ప్రకటించింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న పార్టీకి మద్దతు ఇస్తామని వైసీపీ స్పష్టం చేసింది.

మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. శివసేన పార్టీ అనర్హత అస్త్రం ప్రయోగించింది. 17 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ దాఖలు చేసింది.

రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కండువా కప్పి వరప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

చివరి వరకు ఉద్దవ్‌ థాక్రేకి అండగా ఉంటాం అంటూ , త్వరలోనే ఈ సమస్య ఎన్సిపి నేత చగన్ భుజ్ బల్ ప్రకటించారు. సమసిపోతుంది, సంకీర్ణ సర్కార్‌ పూర్తికాలం ఉంటుంది అంటూ కామెంట్ చేశారు.

తెలంగాణ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 494 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఇంటర్‌లో వంద శాతం సిలబస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాత విధానంలోనే ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కరోనాతో గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్‌ తో పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈనెల 27న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మె వాయిదా వేసుకున్నాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్ల పై చర్చించేందుకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేసుకున్నాయి.

corona omricon

corona omricon

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,338 మంది కరోనా బారినపడ్డారు. 13 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Visitors Are Also Reading